ట్రంప్ తో కలిసే చాన్సే లేదు.. ఉత్తర కొరియా

Trump-Kimఅమెరికా సంచలన ప్రకటన చేసింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌తో ట్రంప్‌ భేటీకాబోతున్నట్లు వైట్‌ హౌస్‌ ఓ సంచలన ప్రకటనను వెలువరించింది. వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు.

ట్రంప్ తో భేటీ కావాలంటే.. తాము చెప్పే షరతులకు నార్త్ కొరియా ప్రెసిడెంట్ అంగీకరించాల్సి ఉంటుందన్నారు. అంతకు ముందు ట్రంప్ తన ట్విట్టర్ లో కిమ్ జాంగ్ వున్ లు కలవడాన్ని.. అరుదైన గౌరవంగా భావిస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ మరుక్షణమే.. వైట్ హౌస్ నార్త్ కొరియాతో భేటీకి సంబంధించిన ప్రకటనను విడుదల చేయడం సంచలనం కలిగించింది.

ఇరుదేశాధ్యక్షులు కలుసుకునే వాతావరణం ఇప్పుడు లేనప్పటికీ.. మున్ముందు ఆ సమయం వస్తుందన్నారు వైట్ హౌస్ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌. అప్పుడు.. తాము చెప్పే షరతులకు కట్టుబడాలన్నారు.

వైట్ హౌస్ ప్రకటించిన షరతులివే..

ఉత్తర కొరియా తన అణు చర్యలను పూర్తిగా నిలిపేయాలి

  చుట్టుపక్కల దేశాలకు  హాని కలిగించే కార్యక్రమం చేయరాదు

అమెరికాపై అణుదాడికి పాల్పడాలన్న ఆలోచనను విరమించుకోవాలి

అమెరికాకు హాని కలిగించే.. ఎలాంటి కవ్వింపు ప్రకటనలు చేయరాదు

ఈ షరతులు ఒప్పుకున్నప్పుడే ట్రంప్ తో భేటీకి మార్గం సుగమం అవుతుందన్నారు. వైట్ హౌస్ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌.

వైట్ హౌస్ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే నార్త్ కొరియా అమెరికాపై మరోసారి విరుచుకుపడింది. మిస్సైళ్లు, అణుపరీక్షలు నిలిపేయాలన్న అమెరికా అభ్యర్థనను ఉత్తర కొరియా తోసిపుచ్చింది. ఈ విషయంపై కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ మే 1న ఒక ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఆంక్షలను ఖాతరు చేయమని చెప్పింది. ఇంకా రెట్టింపు వేగంతో దూసుకెళతామని స్పష్టం చేసింది ఉత్తర కొరియా. అమెరికా తమపై విరోధభావనను మార్చుకుంటే.. ఆలోచిస్తామని ఉత్తర కొరియా గట్టి వార్నింగ్ ఇచ్చింది.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy