ట్రంప్ భార్య న్యూడ్ ఫోటోల‌పై క‌ల‌క‌లం

trumpఅమెరికా అధ్య‌క్ష రేసులో ఉన్న రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ భార్య అయిన మెలానియా ట్రంప్ న‌గ్న ఫోటోల‌ను అమెరికాకు చెందిన ప్ర‌ముఖ ప‌త్రిక న్యూయార్క్ పోస్ట్ త‌న టాబ్లాయిడ్‌లో ప్ర‌చురించింది. 1995లో ఓ ఫ్రెంచ్ మ్యాగ‌జీన్ కోసం మెలానియా న‌గ్నంగా ఫోజులిచ్చిన‌ట్లు ఆ పత్రిక వెల్ల‌డించింది. ఆ స‌మ‌యంలో మెలానియా టాప్ మోడ‌ల్‌గా ఉండేద‌ని తెలిపింది. ఆలె-డీ-బాసెవెల్ అనే ష్యాష‌న్ ఫోటోగ్రాఫ‌ర్ ఈ ఫోటోల‌ను తీశాడు. ఈ ఫోటోలు పబ్లిష్ అయిన మూడేళ్ల‌కు ట్రంప్‌తో మెలినాకు ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని.. 2005లో వీరు వివాహం చేసుకున్న‌ట్లు న్యూయార్క్ పోస్ట్ ప‌త్రిక క‌థ‌నం రాసింది. ఈ ఫోటోల‌కు ఫోజులిచ్చిన స‌మ‌యంలో మెలినియా వ‌య‌స్సు 25 ఏళ్లు అని చెప్పింది. దీనిపై ట్రంప్ వివర‌ణ ఇచ్చారు. త‌న‌కు మెలానియా పరిచ‌యం కాక‌ముందు తీసిన ఫోటోల‌ని.. అయినా యూరోపియ‌న్ ఫ్యాష‌న్ రంగంలో ఇలాంటివి కామ‌న్ అని ట్రంప్ చెప్పుకొచ్చాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy