ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ లోకి ఫేస్ బుక్

face bookసోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ లోకి ఎంటరైంది.  ఫేస్ బుక్  కంపెనీ ‘ఉబర్’తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఫేస్ బుక్ యూజర్స్ తమ ఫేస్ బుక్ అకౌంట్ నుండే నేరుగా క్యాబ్ ను బుక్ చేసుకునే వీలు ఉంటుంది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఫేస్ బుక్ ద్వారా తమ ట్రాన్స్ పోర్ట్ సేవలు ఈ వారంలో అందుబాటులోకి రానున్నాయని ఉబర్ ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు ఉబర్ యాప్ ను ప్రత్యేకంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని పేస్ బుక్ తెలిపింది. మొదటి సారి ఈ సదుపాయాన్ని వినియోగించుకొనే వినియోగదారులకు ఫ్రీ రైడ్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది.

ఈ పాలసీని త్వరలోనే వాల్డ్ వైడ్ గా అందుబాటులోకి తీసుకురావాలని ఫేస్ బుక్ భావిస్తోంది. ఉబర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో ట్రాన్స్ పోర్టేషన్ బిజినెస్ లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఉబర్తో పాటు ఇతర కంపెనీలతో సైతం ఇలాంటి అగ్రిమెంట్లను కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy