ట్రాఫిక్ అవగాహన అంటే ఇలా : వీడి అరాచకానికి అందరూ ఫిదా

trafficట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వారికి ముందు పెనాల్టీ పాయింట్లు, ఆ తర్వాత జైలు విధానం మంగళవారం (ఆగస్టు1) నుంచే అమలులోకి రానుంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ పద్ధతి అమలులోకి తేనున్నారు. వాహనాలు నడిపేవారు చేసే ఒక్కోరకం ఉల్లంఘనకు కొన్ని పాయింట్లు పడతాయి. 12 పాయింట్లు దాటితే లైసెన్స్‌ రద్దు అవుతుంది. ఆ తర్వాత వెహికిల్‌ నడిపితే జైలు శిక్ష పడుతుంది. అయితే ఇప్పటికే దీనిపై నగర పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.  ఇష్టానుసారం వ్యవహరిస్తున్న వాహనదారుల్లో చైతన్యం పెంచేందుకు ఇప్పటికే పలు రకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న పోలీసులు తాజాగా జీబ్రాలైన్స్‌ను క్రాస్ చేసే వారిని ఉద్దేశించి ఓ వీడియోను రూపొందించారు. జీబ్రాలైన్స్ ఉన్నవి కేవలం పాదచారుల కోసం మాత్రమేనన్న విషయం వాహనదారులకు అర్థం కావాలంటూ ఆ వీడియోకు క్యాప్షన్ జోడించారు. ఇప్పుడీ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy