ట్రాఫిక్ కొరడా..ప్రజలకు దడ దడ

trafficఅంతా నా ఇష్టం అంటే కుదరదు.. నా బండి.. నా స్పీడ్ అంటే చలానా మోత మోగుతుంది. గూబ గుయ్ అనటం ఇప్పటి వరకు చూశాం.. ఇక నుంచి కళ్లు బైర్లు కమ్ముతాయి. వాహన చట్టానికి తీసుకొచ్చిన సవరణలతో ట్రాఫిక్ చలానాలు భారీగా పెరిగాయి. మందుకొట్టి బండి తీస్తే.. నెల జీతం సమర్పించుకోవాల్సిందే. జీతం తక్కువ అయితే జైలు శిక్షతో కవర్ చేస్తారు. వినటానికి అబ్బా అనుకోవచ్చు.. జస్ట్ రెండు, మూడు నెలలు ఆగితే స్వయంగా అనుభవంలోకి కూడా రావొచ్చు మీకు.

వాహన చట్టం సవరణలతో ఇక నుంచి ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినంగా అమలు చేయనున్నారు. జరిమానాలు భారీగా ఉండనున్నాయి. బిల్లుకు కేంద్రం ఆమోదంతో.. త్వరలోనే అమలు చేయటానికి ఆర్టీఏ అధికారులు రెడీ అవుతున్నారు.

వాహన చట్టం సవరణ బిల్లును స్వాగతించారు వాహనదారులు. రోడ్డుపై వెళ్లే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే మిగతా వాళ్లకు కూడా ఎంతో నష్టం జరుగుతుందని.. కఠిన నిబంధనల వల్ల మార్పు వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు

చలానాల పెంపుతో కొంత మార్పు వస్తుందని.. అయితే ఇప్పటికిప్పుడు వెంటనే వస్తుందని ఆశించలేం అంటున్నారు ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్. భారీ జరిమానాతో బాధ తెలుస్తుంది.. ఒకసారి చేసినోళ్లు మరోసారి చేయటానికి భయపడతారని అభిప్రాయపడ్డారు. ఇక స్కూల్ నుంచే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పాఠ్యాంశంగా చేర్చే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు డీసీపీ

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy