ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

traffic-copsరాష్ట్రాల అభ్యంతరాలతో పెండింగ్ లో ఉన్న మోటర్ వాహనాల బిల్ 2016 ను… కేంద్రం ఆమోదించింది. దేశ వ్యాప్తంగా… రవాణా రంగంలో కీలక సంస్కరణలను ఈ బిల్లుతో కేంద్రం అమలు చేయబోతోంది. బిల్లులో 68 సెక్షన్లకు సవరణలతో పాటు.. 28 కొత్త సెక్షన్లు చేర్చింది. ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది.

హెల్మెట్ లేకున్నా.. లైసెన్స్ లేకున్నా… ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నా… ఇన్సూరెన్స్ లేకున్నా… ఇకపై కుదరదంటోంది కేంద్రం. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించేవారికి భారీగా ఫైన్ వేస్తూ రూపొందించిన మోటర్ వాహనాల సవరణ బిల్లు 2016ను… కేంద్ర కేబినెట్ ఆమోదించింది. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి 10 వేల రూపాయలు, హిట్ అండ్ రన్ కేసుల్లో దొరికిన వారికి 2 లక్షల రూపాయల ఫైన్ ను బిల్లులో ప్రపోజ్ చేశారు. 18 రాష్ట్రాల రవాణా మంత్రుల సిఫారసుల ప్రకారమే బిల్లును ఫైనల్ చేసినట్టు కేంద్రం తెలిపింది.

ఓవర్ స్పీడ్ కు వెయ్యి నుంచి 4 వేల వరకు.. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం డ్రైవ్ చేస్తే 2 వేల ఫైన్, 3 నెలల జైలు శిక్ష.. హెల్మెట్ లేకుంటే 2 వేలు, 3 నెలలు లైసెన్స్ రద్దు… జువెనల్స్ అతిక్రమణల సందర్భాల్లో వారి సంరక్షకుడికి 25 వేల జరిమానా, 3 ఏళ్ల జైలు, వాహన రిజిస్ట్రేషన్ రద్దు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు 100 నుంచి 500 పెరిగిన ఫైన్.. వీటికి తోడు అధికారుల ఆదేశాలు పట్టించుకోకుంటే కనీస ఫైన్ 2 వేలుగా, లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఫైన్ 5 వేల రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది.

అర్హతలు లేకుండా డ్రైవ్ చేస్తే 10 వేలు.. ప్రమాదకర డ్రైవింగ్ కు ఫైన్ వెయ్యి నుంచి 5 వేలకు పెంపు.. తాగి డ్రైవ్ చేస్తే 10 వేలు.. రూల్స్ ఉల్లంఘించే క్యాబ్ డ్రైవర్లకు లక్ష వరకూ ఫైన్.. ఎక్కువ లోడ్ తో వెళ్తే 20 వేలు.. సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే వెయ్యి…. ఇలా చాలా వరకు కొత్త నిబంధనలను కేంద్రం ఈ బిల్లులో అమల్లోకి తెచ్చింది. దేశ వ్యాప్తంగా ఒకే రకమైన రిజిస్ట్రేషన్లకు.. వాహన్, సారథి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్టర్ తీసుకురావాలని డిసైడైంది. ఓవరాల్ గా… రోడ్డు ప్రమాదాలను ఇప్పటితో పోలిస్తే 50 శాతం తగ్గించడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది.

2 Responses to ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

  1. Anonymous says:

    Pure stupidity…!!

  2. Sudhakar says:

    purely revenue generation scheme……..@2016

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy