ట్రాఫిక్ రూల్స్ బ్రేక్: పెరిగిన జరిమానాలు

fine-traficనిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా వాహనదారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తూనే ఉన్నారు. దీంతో అధికారులు మరింత పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించన వాహనదారులకు భారీ జరిమానా విధించడంతో పాటు…లైసెన్స్ రద్దు చేయడం, వాహనాలను సీజ్ చేస్తున్నారు.

రాష్ట్రంలో నిత్యం వేలాది మంది వాహనదారులు యథేచ్ఛగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. లైసెన్స్‌ లేకుం డా వాహనాలు నడపడం మొదలు మందు కొట్టి బండ్లు నడపడం వరకు వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారి ని దారికి తెచ్చేందుకు అధికారులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతూ జరిమానాలు విధిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటా వసూలవుతున్న ఈ జరిమానాల విలువ రూ.300 కోట్లు దాటింది. ప్రధానంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌తోపాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్‌ ఉల్లంఘనులు భారీగా జరిమానాలు కడుతున్నారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల జరిమానాలు చెల్లిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ పరిధి లో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల చొప్పున జరిమానాలు కడుతున్నారు. మిగిలిన జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో రోజుకు రూ.85 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానాలు చెల్లిస్తున్నారు. ఇలా 24 యూనిట్లలో ఏటా రూ.87.64 కోట్లు జరిమానాల రూపంలో వాహనదారులు మూల్యం చెల్లిస్తున్నారు.

దీంతో పాటు వీకెండ్ లో 3 రోజులపాటు జరిగే డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల ద్వారా వాహనదారులు చెల్లిస్తున్న మూల్యం ఏటా రూ.10 కోట్లు దాటిపోతోంది. ఇవి కేవ లం ట్రాఫిక్‌ పోలీసులకు చెల్లిస్తున్న జరిమానాలే. దీనికితోడు శాంతిభద్రతల విభాగం పోలీసులు చేసే ప్రత్యేక డ్రైవ్‌లు, సాధారణ తనిఖీ ల్లో భాగంగా మొత్తం పోలీసుశాఖకు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్లు జరిమానాల రూపం లో వాహనదారులు చెల్లిస్తున్నారు. అదే విధం గా రవాణశాఖ అధికారులు నిత్యం వాహనాల తనిఖీ, నిబంధనల ఉల్లంఘనులకు వేసే జరి మానాలు ఏకంగా రూ.150 కోట్లు దాటింది.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆన్‌లైన్‌ చలాన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినా జిల్లాలు, కొత్తగా ఏర్పడ్డ కమిషనరేట్లలో ఇంకా మాన్యువల్‌గానే చలాన్లు రాస్తున్నారు. అయితే త్వరలో ప్రతీ జిల్లా కేంద్రంతోపాటు ఆ జిల్లా పరిధిలోని ప్రధాన పట్టణాల్లో CCTVల ద్వారా ఆటోమేటిక్‌ ట్రాఫిక్‌ చలాన్‌ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అలాగే డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు కూడా జిల్లాహెడ్‌క్వార్టర్స్‌లోని పోలీసులు మాత్రమే చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పరికరాలు అందుబాటులోకి వస్తే ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు. దీంతో మందు కొట్టి వాహనాలు నడిపేవాళ్లు చెల్లించే చలానాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.

జరిమానాలు చెల్లించావారి సంఖ్య రోజు రోజుకు పెరగటానికి కారణం కంట్రోల్ లేకపోవడే. నియంత్రణ పాటించకుండా విపరీతమైన వేగం, నిర్లక్ష్యం కారణంగా చలాన్ల రూపంలో కోట్ల రూపాయల జరిమానాలు కడుతున్నారు. లక్షల రూపాయల విలువైన వాహనాలు కొనుగోలు చేసే వాహనదారులు వాటి రిజిస్ట్రేషన్లు, బీమా, ఇతరత్రా వ్యవహారాల్లో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీని కారణంగా అటు ట్రాఫిక్‌ పోలీసులకు, ఇటు రవాణాశాఖ అధికారులకు జరిమానాలు చెల్లించుకుంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy