ట్రాఫిక్ రూల్స్: లైసెన్స్ లేకుంటే ఇకంతే..

traffic-policeట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. సోమవారం నుంచే  సీరియస్ ప్రణాళికలను అమలు చేయబోతున్నారు. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాలను ఎంచుకుని హఠాత్తుగా అన్ని వైపుల నుంచి ఎటాక్ చేసి తనిఖీలు చేస్తారు. ఏ రకమైన ఉల్లంఘనకు పాల్పడి దొరికినా అక్కడికక్కడే జరిమానా కట్టి ఆ రశీదు చూపిస్తేనే వదిలేస్తారు. పాత బకాయిలున్నా అవి కూడా అప్పటికప్పుడే చెల్లించాల్సిందే. లేదంటే వాహనాన్ని జప్తు చేస్తారు. హెల్మెట్,లైసెన్స్, రిజిస్ట్రేషన్,బీమా వీటిలో ఏది లేకున్నా శిక్ష తప్పదు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై 2015 లో 3,81,794 కేసులు నమోదయ్యాయి.2016 నాటికి ఆ సంఖ్య 8,08,735 కు చేరింది. వీరిలో  సెల్ ఫోన్ డ్రైవింగ్, సీటు బెల్ట్, హెల్మెట్ ధరించని వారే అధికంగా ఉన్నారు. హైదరాబాద్ లో కోటి జనాభా ఉంటే… అందులో సగం వాహనాలున్నట్లు అంచనా. రోజు కొత్తగా 1000 వాహనాలు రోడ్ల పైకి చేరుతున్నాయి. వీరిలో 60 నుంచి 70 శాతం మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వారి వల్ల కలిగే ప్రమాదాలకు భారీగా జరిమానా విధించటం, వాహనాలను సీజ్ చేయడం,చార్జిషీట్ దాఖలు చేయటం వంటి చర్యల ద్వారా కట్టడి చేసేందుకే చర్యలు చేపడుతన్నట్లు తెలిపారు పోలీసులు.

3 Responses to ట్రాఫిక్ రూల్స్: లైసెన్స్ లేకుంటే ఇకంతే..

  1. rajesh says:

    First police laku anni unnayaaa adagandi , media vallu police nu support cheyadam maneyandi .

  2. rajesh says:

    Specially v6

  3. Anonymous says:

    rules for only common people.. not for rich and politicians and their relatives, now a days common people living to pay rich ,politicians and news channels.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy