ట్రీట్ మెంట్ లో కొత్త కల్చర్ …విత్ ధెరపీ డాగ్స్

theraphyఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేస్తారు….? హాస్పిటల్ లో చేరి ట్రీట్ మెంట్ తీసుకుంటారు. ట్రీట్ మెంట్ కూడా రకరకాలు ఉంటుంది.అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని…..ఇలా ఉంటాయి. ఇవేమీ కాకుండా….మరో రకం చికిత్స కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అదేమిటంటే…… కుక్కలతో ట్రీట్ మెంట్….! అవును నిజమే కుక్కతో ట్రీట్ మెంటే…..! హాస్పిటల్ లోకి  కుక్కలు రావడమేంటి….? అని నివ్వెర పోకండి.  ఇది మామూలు కుక్క కాదు. ఒక రకంగా చెప్పాలంటే…..ధెరపీ డాగ్. హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఆస్పత్రుల్లో చేరిన వాళ్లకు ట్రీట్ మెంట్ ఇచ్చే పెట్ డాగ్.   పేరు…..ఫ్రేజర్. ఫ్రేజర్ హాస్పిటల్ లోకి ఎంటర్ కాగానే, అచ్చంగా డ్యూటీ డాక్టర్ లా బిహేవ్ చేస్తుంది. ఒకటి తరువాత మరోటి…..అన్ని వార్డుల్లో తిరుగుతుంది. పేషెంట్లను ప్రేమగా పలకరిస్తుంది. ఓ పేషెంట్ కు బ్రెస్ట్ కేన్సర్ ఉంది. అప్పటి వరకు  డల్ గా ఉన్న కేన్సర్  పేషెంట్ ….ఫ్రేజర్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పటి దాకా….చెవిలో మందు వేయించుకోవడానికి మారాం చేసిన పిల్లాడు…..మనసు మార్చుకుంటాడు.  ఫ్రేజర్ చెవి ఓసారి చెక్ చేసి….తాను కూడా చెవిలో మందు వేయించుకుంటాడు. ఇలా అందరు పేషెంట్లను కలిసి…..వాళ్లకు  ఆనందాన్ని పంచి…..ఫ్రేజర్ ఇంటికి బయల్దేరుతుంది. ఫ్రేజర్ ఒక్కటే కాదు….. అన్ని ధెరపీ డాగ్స్…. ప్రతి రోజూ ఇలాగే ఠంచనుగా డ్యూటీ చేస్తాయి. పెట్ డాగ్స్ తో …..పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేయడాన్ని…..యానిమల్ అసిస్టెడ్ ధెరపీ అంటారు. ఈ ధెరపీ వెనుక   నలభైల నాటి ఒక ఇంటరెస్టింగ్ స్టోరీ ఉంది. మిలటరీ జవాన్లు కొంతమంది గాయపడితే, వాళ్లను  హస్పిటల్ లో  చేర్చారు.  ఈ గాయపడ్డ జవాన్లను  పరామర్శించడానికి ప్రతిరోజూ వాళ్ల ఆఫీసర్…..హాస్పిటల్ కు వెళుతుండే వాడు.  వెళుతూ ….వెళుతూ  తన పెట్ డాగ్ ను కూడా తీసుకెళ్లే వాడు. పెట్ డాగ్……..హాస్పిటల్ లోకి ఎంటర్ కాగానే,  పేషెంట్లు మొహాలు సంతోషంతో వెలిగిపోయేవి. ఈ విషయాన్ని గమనించాడు…..మిలటరీ ఆఫీసర్. ఆ తరువాత…కొన్ని పెట్ డాగ్స్ కు స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చాడు. దీంతో……ధెరపీ డాగ్స్ …..ఆస్పత్రుల్లోకి వచ్చేశాయి. పెట్ డాగ్స్ ను  చూస్తున్నా……..కాసేపు వాటితో  టైంపాస్  చేసినా…….పేషెంట్లు ఉల్లాసంగా  మారతారు.  బీపీ కంట్రోల్ అవుతుంది. యాంక్సైటీ  తగ్గుతుంది.  పేషెంట్ లో కొత్త శక్తి వస్తుంది. ఇదంతా గాలి పోగేసి చెబుతున్న మాట కాదు.  మెడికల్  రీసెర్చ్ లో  వెల్లడైన వాస్తవాలు.  పెట్ డాగ్స్  అన్నీ……….ధెరపీ డాగ్స్ గా పనికిరావు. ధెరపీ డాగ్ …….సమ్ ధింగ్ డిఫరెంట్.  ఒక ప్రత్యేక కేరెక్టర్ ఉంటుంది. బేసికల్ గా కామ్ గా  ఉండటం…..ధెరపీ డాగ్ కు  కావాల్సిన  ముఖ్య  లక్షణం.  యజమానితో ….ముక్కు మోహం తెలియని వాళ్లు మాట్లాడుతుంటే…..కామ్ గా ఉండాలే కానీ….భౌ భౌ మంటూ….ఎగర కూడదు.  ఎదుటి వాళ్లను రవ్వంత  ఇబ్బంది పెట్టే  నేచర్ ఉన్నా…ధెరపీ డాగ్ గా పనికి రాదు.  ఒక్క మాటలో చెప్పాలంటే….మనుషుల ఫీలింగ్స్ అర్థం చేసుకుని…..అందుకు తగ్గట్లు  బిహేవ్  చేయాల్సి ఉంటుంది. ధెరపీ డాగ్ గా  సెలెక్ట్ అయిన వాటికి  స్పెషల్  ట్రైనింగ్ ఇస్తారు. పేషెంట్లతో  ఎలా  బిహేవ్ చేయాలో  నేర్పుతారు.  ఆస్పత్రి వాతావరణానికి తగ్గట్లు  ప్రవర్తించడంలో  ట్రైనింగ్ ఇస్తారు.  ఎలాంటి చిరాకులు…పరాకులకు లోను కాకుండా….చాలా కూల్ గా ఒక డాక్టర్ డ్యూటీ చేసినట్లు …..పేషెంట్లకు సంతోషం పంచడాన్ని  నేర్పుతారు.  ధెరపీ డాగ్స్ ఇంటర్నేషనల్   ఆర్గనైజేషన్ …..ఈ ట్రైనింగ్ లో  మేజర్ రోల్  పోషిస్తోంది. ధెరపీ డాగ్స్….పేషెంట్లకు  ఎలాంటి  మందూ…..మాకూ ఇవ్వవు. కాసేపు వాళ్లతో  గడుపుతాయి.  ఆ కొన్ని నిముషాల్లోనే  పేషెంట్లకు  ఆత్మీయతను  పంచుతాయి. వాళ్లలో జోష్  తీసుకువస్తాయి. పేషెంట్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో, విదేశాల్లో  ధెరపీ డాగ్స్  కు  క్రేజ్  పెరుగుతోంది. అనేక హాస్పిటల్స్ …..వారానికి  రెండు …మూడు రోజుల  ధెరపీ డాగ్స్ ను  ప్రత్యేకంగా పిలిపించుకుంటున్నాయి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy