ట్రెండ్ సెట్ చేశారు: టీ20 వరల్డ్ కప్ గెలిచి నేటికి పదేళ్లు

dh4టీ20 ఫార్మాట్ లో టీమిండియా ట్రెండ్ సెట్ చేసిన రోజిది. ధోనీ లీడర్షిప్ ఎలా ఉంటుందో తెలియజెప్పిన రోజు. జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌ గ్రౌండ్ లో టీ20 ప్రపంచ విజేతగా భారత్ నిలిచి ఇవాళ్టితో 10 పదేశ్లు. 2007 సెప్టెంబర్ 24న ఫైనల్లో పాకిస్తాన్‌ ను ఓడించి తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా రికార్డులకెక్కింది భారత్. ఆ మధుర జ్ఞాపకాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం.

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ లో గంభీర్‌ (75)  జోరుగా ఆడటంతో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. పాకిస్తాన్‌ మాత్రం 19.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్‌  అయ్యింది. దీంతో 5 పరుగులతో విజయం భారత్ సొంతమైంది. ఆఖరి ఓవర్లో పాక్‌ విజయానికి 13 పరుగులు అవసరం. మిస్బా హుల్ హక్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే మిస్బా సిక్సర్‌ బాదడంతో తొలి 2 బంతుల్లో 7 పరుగులు వచ్చాయి. మరో 4 బంతుల్లో 6 పరుగులు చేస్తే చాలు. అయితే మూడో బంతిని స్కూప్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో మిస్బా గాల్లోకి లేపాడు. షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లో ఉన్న శ్రీశాంత్‌ క్యాచ్‌ పట్టేశాడు.  దీంతో సిరీస్ భారత్ సొంతమైంది. ధోనీ సేన విశ్వవిజేతగా నిలిచింది.

ఈ మ్యాచ్ ఎంతో మంది యువకులకు కొత్త ఉత్సాహాన్ని.. క్రికెట్ లో ఎదగాలనే స్ఫూర్తిని రగిలించింది. ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫార్మాట్ పట్ల క్రేజ్ ను పెంచింది. అందుకే ఈ రోజును ట్రెండ్ సెట్ చేసిన రోజుగా చెబుతుంటారు క్రీడా విశ్లేషకులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy