ట్రెయిన్ లో ఆ టైమ్ లోనే పడుకోవాలి

train-sleepingరైళ్లలో నిద్ర సమాయాన్ని కుదించింది రైల్వే శాఖ. దీంతో ఇకపై ఎంతసేపంటే అంత సేపు నిద్రపోవడానికి లేదు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలకే వరకే నిద్రపోవాలి. ఇవేం టైమింగ్స్ అనుకుంటున్నారా..?  లోయర్‌, మిడిల్‌ బెర్తులు దక్కించుకున్న ప్రయాణికులు జర్నీలో ఇకపై ఆ టైముల్లోనే పడుకోవాలి. లేదంటే చర్యలు తప్పవు.  తమకు ఫిర్యాదులు అందడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది రైల్వే శాఖ. ముఖ్యంగా పగటివేళలో కూడా ప్రయాణికులు బెర్తులు కిందకు దించి నిద్రించడం వల్ల ఆర్‌ఏసీ ప్రయాణికుల సీట్లు లభించడం లేదని కొంతకాలంగా ఫిర్యాదులు ఉన్నాయి. వీటికి పరిష్కారంగా రైల్వే శాఖ తాజాగా ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ జారీ చేసిన సర్క్యులర్‌ని ఇండియన్‌ రైల్వేస్‌ కమర్షియల్‌ మాన్యువల్‌ వాల్యుమ్‌ -1 లో 652వ పేరాలో చేరుస్తున్నట్లు రైల్వే బోర్డు సభ్యుడు, ప్యాసెంజర్‌ మార్కెటింగ్‌  డైరెక్టర్‌ విక్రమ్‌ సింగ్‌ ప్రకటించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy