ట్రైలర్ తో ఉత్కంఠ రేపుతున్న వెంకటాపురం

venkatapuramప్రమోషన్స్ తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడం ఓ కళ.. అలా కొన్ని రోజుల క్రితం వెంకటాపురం అనే సినిమాలో హీరో ఫేస్ కనిపించకుండా చేసిన పోస్టర్ డిజైనింగ్ ఎంతోమందిని ఆకట్టుకుంది. ఈ పోస్టర్స్ తో ఆ హీరో ఎవరై ఉంటారా అనే క్యూరియాసిటీని బాగా పెంచారు.

లేటెస్ట్ గా ఈ క్యూరియాటీకి తెరదించుతూ రిలీజ్ చేసిన ట్రైలర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కారణం ఆ హీరో రాహుల్.. హ్యాపీడేస్ లో టైసన్ అనే పేరున్నా.. సన్నగా కనిపించిన రాహుల్.. ఇప్పుడు నిజంగానే టైసన్ లా మారి భారీ చేంజ్ ఓవర్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా హీరోగా రాహుల్ కు ఖచ్చితమైన బ్రేక్ ఇచ్చే సినిమాగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే యూట్యూబ్ లో ట్రెండింగ్ కావడం విశేషం. దీంతో ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సినిమా బిజినెస్ కూడా ఊపందుకుంది. ఇదే ఈ చిత్ర విజయానికి తొలిమెట్టుగా భావిస్తోంది టీమ్.

వెంకటాపురం ట్రైలర్ చూస్తుంటే హీరో ఎవరు? విలన్ ఎవరు? అన్న సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. ఈ మధ్య కాలంలో వస్తోన్న సినిమాలు సరికొత్త కథాంశాలతో.. తెలుగు సినిమా రేంజ్ ను పెంచుతున్నాయి. వెంకటాపురం మూవీ కూడా ఒక్క ట్ర్రైలర్ తోనే ఆ కోవలో నిలిచే సినిమాగా పేరు తెచ్చుకుంది.. మార్చి మొదటి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy