ట్రైలర్ : మాస్ గెటప్ లో ‘ఇంద్రసేన’

INDRA‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన విజయ్ తన కొత్త సినిమా ఇంద్రసేనని త్వరలోనే ఆడియన్స్ ముందుకు తేవాలని భావిస్తున్నాడు. సి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ ని గురువారం(అక్టోబర్-12) విడుదల చేశారు. ఇందులో విజయ్ ఆంటోని మాస్ అవతారంలో కనిపించగా, ట్రైలర్ ప్రేక్షకులకి కనువిందుగా మారింది. ఇంద్రసేన సినిమాని రాధిక శరత్ కుమార్ తో కలిసి విజయ్ ఆంటోని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విజయ్ ఆంటోని నిర్మాతగానే కాదు సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా పని చేస్తుండడం విశేషం. మరి తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy