ట్విట్టర్ లో రిటైర్మెంట్ ప్రకటించిన సెహ్వాగ్

sehwag_1910getty_750బాల్ కి భయం… ఎంత బలంగా బాదుతాడోనని. బౌలర్ కు భయం బాల్ పిచ్ అయితే.. వెళ్లేది ఫోరో.. సిక్సో అని. అపోనెంట్ కి భయం… అతను క్రీజ్ లో ఉంటే మ్యాచ్ చేజారిపోతుందని. అతను క్రీజ్ లో ఉంటే టార్గెట్ ఎంత పెద్దదైనా చిన్నదైపోతుంది. నజఫ్ ఘడ్ నవాబ్.. వీరేంద్ర సెహ్వాగ్ గురించే ఇవన్నీ. సిక్స్ తో ట్రిపుల్ సెంచరీ కొట్టడం… ఫోర్ తో డబుల్ సెంచరీని అచీవ్ చేయడం వీరుకూ మాత్రమే తెలిసిన మజా. రాకెట్ వేగంతో బౌండరీలు బాదే సెహ్వాగ్… తన రిటైర్మెంట్ ని ప్రకటించేశాడు. అన్ని ఫార్మెట్లకు వీడ్కోలు పలుకుతున్నట్టు అనౌన్స్ చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్. ఇండియన్ క్రికెటర్స్ లో మరో లెజెండరీ క్రికెటర్. 1978 అక్టోబర్ 20న ఢిల్లీలోని నజఫ్ ఘడ్ లో పుట్టిన వీరు.. సరిగ్గా తన 37వ పుట్టిన రోజుకు ముందే ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. వీర విధ్వంసం ఎలా ఉంటుందో చూపించిన క్రికెటర్ వీరూ.

తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఆదర్శంగా క్రికెట్ ని ఫీల్డ్ గా ఎంచుకున్నాడు. ఒకానొక దశలో మాస్టర్ నే మించిపోయాడు. ఫుట్ వర్క్ లేదన్నా… క్లాస్ షాట్స్ ఆడలేడన్న విమర్శలెదుర్కొన్నా… రనప్ సరిగా ఉండదని కామెంట్స్ చేసినా… అవేవీ అతని కెరీర్ ని అడ్డుకోలేకపోయాయి.

1అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు వీరూ సొంతం. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ, వన్డేల్లో డబుల్ సెంచరీ అందుకున్న రెండో బ్యాట్స్ మెన్ గా.. టెస్ట్ క్రికెట్ లో హండ్రెడ్ స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాట్స్ మెన్ గా ఎన్నో రికార్డులు తన పేరుతో రాసుకున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ, టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఫస్ట్ బ్యాట్స్ మెన్ గా రికార్డ్ సృష్టించాడు. 104 టెస్టుల్లో 8586 రన్స్, 251 వన్డేల్లో 8 వేల 273 రన్స్ చేశాడు. 19 టీ20లు ఆడిన వీరూ… 394 రన్స్ చేశాడు. 2000 నవంబర్ లో సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్ ఆడిన సెహ్వాగ్… 2013 మార్చిలో ఆస్ట్రేలియాతో లాస్ట్ టెస్ట్ ఆడాడు. ఇక వన్డేల్లో 1999 ఎప్రిల్ 1న పాక్ తో ఫస్ట్ వన్డేతో ఆరంగేట్రం చేసిన ఈ డాషింగ్ బ్యాట్స్ మెన్… 2013 జనవరిలో అదే పాక్ తో లాస్ట్ వన్డే ఆడాడు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy