ట్విట్టర్ లో తొలిసారిగా ఈ-స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్

f1b5lfuzmwvzs7nslwbnసోషల్ మీడియా సైట్లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వస్తోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమ్ లవర్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన ఆ సంస్థ ఆ దిశగా తొలి అడుగు వేసింది. ’కౌంటర్ స్ట్రైక్-గ్లోబల్ ఆఫెన్సివ్’ అనే ఆన్ లైన్ వీడియో గేమ్ కాంపిటేషన్ ను మొదటిసారిగా లైవ్ స్ట్రీమ్ చేయనుంది ట్విట్టర్. ఈ మేరకు ఈ-లీగ్ అనే ప్రొఫెషనల్ ఈ-స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ గేమ్ సెమీ ఫైనల్స్ అండ్ ఫైనల్స్ శనివారం,ఆదివారం జరగనుంది. ఈ అగ్రిమెంట్ తో అటు ట్విట్టర్ ఇటు ఈ-స్పోర్ట్స్  సంస్థకు కూడా లాభం చేకూరుతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్  ఇప్పటికే వివిధ రంగాలకు సంబంధించిన లైవ్ డిస్కషన్స్, కామెంటరీలతో పాటు తాజాగా వింబుల్డన్ కూడా లైవ్ స్ట్రీమింగ్ చేసింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy