డబుల్ ధమాకా : ఇండియాలోనే 2021, 23 క్రికెట్ వాల్డ్ కప్ లు

teamఇండియా రెండు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సెల్(ICC) మెగా టోర్నీలకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. 2021లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2023 వన్డే వరల్డ్ కప్‌ భారత్‌ గడ్డపైనే జరగనుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) సోమవారం(డిసెంబర్-11) జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

గతంలో భారత్ 1987, 1996, 2011 వన్డే ప్రపంచకప్‌లకి ఆతిథ్యమిచ్చింది. 2023 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్, శ్రీలంకని భాగస్వామ్యం చేయకుండా ఆతిథ్య హక్కుల్ని మొత్తం భారత్‌ తన దగ్గరే ఉంచుకునేలా BCCI తాజాగా నిర్ణయం తీసుకుంది. 2013లోనే ఈ హక్కులకి సంబంధించిన అగ్రిమెంట్ జరగగా.. అందులో భాగంగా దక్కించుకున్న 2016 టీ20 ప్రపంచకప్‌‌ టోర్నీని సమర్థంగా నిర్వర్తించి భారత్ పేరు నిలబెట్టుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచకప్‌ని మరింత ఆకర్షనీయంగా నిర్వహించేందుకు BCCI చర్యలు చేపడుతోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy