డబుల్ ధమాకా: టాప్ స్పీడ్ లో జియో

JIOఆఫర్లతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో… ప్రత్యర్థుల కంటే డబుల్ స్పీడులో దూసుకెళ్తోంది. మరోసారి డౌన్ లోడ్ స్పీడులో మార్కెట్ లీడర్ గా నిలిచింది. జియో సగటు డౌన్ లోడ్ స్పీడు 16.48 MBPS గా నమోదైంది. ఈ స్పీడు ఐడియా సెల్యులార్, భారతీ ఎయిర్ టెల్ కంటే రెండింతలు ఎక్కువని టెలికాం రెగ్యులేటరి ట్రాయ్ రిపోర్టు పేర్కొంది. మే నెలలో జియో సెకనుకు 16.48 మెగాబిట్ సగటు డౌన్ లోడ్ స్పీడును అందించినట్టు ట్రాయ్ రిపోర్టు పేర్కొంది. దీని తర్వాత ఐడియా 8.33 MBPS ఇచ్చిందట. టెలికాం దిగ్గజంగా పేరున్న భారతీ ఎయిర్ టెల్ స్పీడడ్ 7.66 MBPS అని వెల్లడైంది.

జియో ప్రస్తుతమందిస్తున్న ఈ 16.48 MBPS స్పీడులో యూజర్లు ఒక బాలీవుడ్ సినిమాను 5 నిమిషాల్లో డౌన్ లోడ్ చేసుకునే అవకాశముంటుందని తెలిసింది.

One Response to డబుల్ ధమాకా: టాప్ స్పీడ్ లో జియో

  1. Anonymous says:

    i think this is April only how geo reach that speed in advance

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy