డబుల్ సెంచరీతో కోహ్లీ సంచలన రికార్డ్స్

kohliటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టాడు. ఉప్పల్ స్టేడియంలో విరాటపర్వం చూపించాడు. డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. 243 బంతుల్లో 203 రన్స్ చేశాడు. 24 ఫోర్లతో గ్రౌండ్ ను హోరెత్తించాడు. ఫోర్లతో స్టేడియం చుట్టూ బంగ్లాదేశ్ ఫీల్డర్లను పరిగెత్తించాడు. కోహ్లీని అడ్డుకోవటానికి బంగ్లా టీం పదేపదే బౌలర్లను మార్చింది. బౌలర్ ఎవరైనా సరే.. కోహ్లీ బాదుడును అడ్డుకోలేకపోయారు. టెస్టుల్లో కోహ్లీకి ఇది నాలుగో డబుల్ సెంచరీ. వరసగా నాలుగు టెస్ట్ సిరీస్ ల్లో నాలుగు డబుల్ సెంచరీలు చేయటం కూడా రికార్డ్. 204 పరుగుల దగ్గర తైజుల్ ఇస్లామ్ బౌలింగ్ లో ఎల్బీడబ్యూగా ఔట్ అయ్యాడు. కోహ్లీ – రహానే జోడీ నాలుగో వికెట్ 195 బంతుల్లో 150 రన్స్ చేసింది.

రికార్డ్స్ బద్దలు

బంగ్లాదేశ్ పై సెంచరీతో.. టెస్ట్ మ్యాచ్ ఆడే ప్రతి జట్టుపై సెంచరీ కొట్టిన రికార్డ్ క్రియేట్ చేశాడు విరాట్. ఒక సీజన్ లో ఇండియాలో జరిగిన మ్యాచుల్లో వెయ్యి పరుగులు చేసిన రికార్డ్ కూడా సాధించాడు. గతంలో వీరేంద్రసెహ్వాగ్ (1105) ఉన్న రికార్డ్ ను అధిగమించాడు. 2004-05 తర్వాత 13ఏళ్లకు కోహ్లీ ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 2016-17 సీజన్ లో 15 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన కోహ్లీ.. నాలుగు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.

ఇండియా స్కోర్ : 503 / 5 (129 ఓవర్స్)

రాహుల్ – 2

విజయ్  – 108

పుజారా – 83

కోహ్లీ     – 204

రహానే   – 82

సాహ    – 13 ( నాటౌట్ )

అశ్విన్  – 4 ( నాటౌట్ )

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy