డబ్బా వాలాలూ రేట్లు పెంచారు..!

dabbawalaడబ్బా వాలాలు రేట్లు పెంచేశారు. ముంబాయిలో రోజుకు లక్షల మందికి లంచ్ బాక్సులు అందించే వీరు రేట్లను పెంచినట్లు ప్రకటించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిత్యావసర సరుకులతో పాటు అన్ని ధరలు పెరిగాయని దీంతో తమకు వేరే మార్గం లేదని డబ్బా వాలాలు చెప్తున్నారు. తమ డెలివరీ కాస్ట్ ను రూ.100కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తమ నిర్ణయానికి కస్టమర్లు సహకరించాలని వారు కోరుతున్నారు. ముంబాయి వాసులంతా తమకు అండగా నిలవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

తమ డబ్బా వాలాలూ ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేందుకు…ప్రస్తుతం ఉన్న సంక్షోభం నుంచి వారు బయట పడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని డబ్బా వాలాల అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ రఘనాథ్ మెడ్గే చెప్తున్నారు. ప్రస్తుతం ట్రాన్స్ పోర్టుతో పాటు అన్ని రకాల ధరలు పెరిగాయని..డబ్బా వాలాల కనీస జీవితం గడవాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పడం లేదన్నారు మెడ్గే. ఇక నుంచి ప్రతి ఏడాది తమ కాస్ట్ కొంచెం కొంచెం పెరుగుతోందన్నారు.

గత 125ఏళ్లుగా డబ్బావాలా వ్యాపారం సాగుతోందని…రోజుకు లక్షల మందికి లంచ్ బాక్సులు ట్రాన్స్ పోర్టు జరుగుతోందని ఆయన అన్నారు. 5వేల మంది డబ్బాల వాలాల జీవితం సాఫీగా సాగేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని..ప్రజలే అర్ధం చేసుకోవాలని కోరుతున్నామన్నారు మెడ్గే.

డబ్బా వాలాలు తీసుకెళ్తే లంచ్ బాక్సులు ఎప్పుడూ మిస్ కావు..కరెక్ట్ గా ఎవరి లంచ్ బాక్స్ వారికే ఇస్తుంటారు. 80లక్షల లంచ్ బాక్సుల్లో ఒక్కటో,రెండో మిస్ అవుతాయంట. ఈ బిజినెస్ కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. విదేశాలకు చెందిన ప్రిన్స్ ఛార్లెస్, రిచర్డ్ బ్రాన్సన్ కూడా డబ్బా వాలాల బిజినెస్ కు అభిమానులే. గ్లోబల్ బిజినెస్ స్కూళ్లలో డబ్బా వాలాల ఆపరేషన్లు గురించి సబ్జెక్టు కూడా ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy