డబ్బులిస్తేనే ఆడుతున్నాం : క్రికెట్ లో దేశభక్తి లేదు

MORTAJAబంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మష్రఫె మొర్తజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్లుగా తాము దేశానికి చేసేదేం లేదని.. డబ్బులు తీసుకుని క్రికెట్‌ ఆడుతామన్నాడు. క్రికెట్‌కు… దేశభక్తికి ముడిపెట్టడం సరికాదన్నాడు. తమను హీరోలుగా కీర్తించొద్దని అభిమానుల్ని అతను కోరాడు. క్రికెట్‌ చుట్టూ ముడిపడిన దేశభక్తేంటో తనకు అర్థం కాదన్న మొర్తజా.. అభిమానులు వ్యక్తులుగా తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడం మీద దృష్టిపెడితే మంచిదన్నాడు. అంతే కాదు నేను ఒక క్రికెటర్ ను మాత్రమే నని ఒకరి ప్రాణాన్ని కాపాడలేనన్నాడు. అదే ఓ డాక్టర్ కాపాడగలడు.. కానీ దేశంలోని అత్యుత్తమ డాక్టర్ ను ఎవరూ అభినందించరన్నాడు. వాళ్లే నిజమైన స్టార్లు అన్నాడు. అలాగే శ్రామికులు కూడా… వాళ్లు దేశాన్ని నిర్మిస్తారని తెలిపాడు. మేం క్రికెట్‌ ద్వారా ఏం చేస్తా… కనీసం ఒక ఇటుక తయారు చేయడం గానీ.. క్రికెట్‌ మైదానంలో వరి పండిచడం చేయగలమా అని ప్రశ్నించాడు. ఇటుకలతో ఫ్యాక్టరీలు నిర్మించే శ్రామికులు.. పొలాల్లో పంటలు పడించేవాళ్లు నిజమైన తారలు అని తెలిపాడు. క్రికెటర్లుగా మేమేం చేస్తాం? నిజాయితీగా చెప్పాలంటే డబ్బులు తీసుకుంటాం… ఆట ఆడతాం. ఒక సింగర్, యాక్టర్ చేసేదే మేమూ చేస్తామన్నాడు. అంతకుమించి ఏం లేదు. క్రికెట్‌తో ముడిపడ్డ దేశభక్తి ఏంటో అర్థం కావడంలేదన్నాడు. ఇలా మాట్లాడేవాళ్లందరూ ముందు రోడ్డు మీద అరటి తొక్కలు వేయడం, వీధుల్లో ఉమ్మడం, ట్రాఫిక్‌ రూల్స్అతిక్రమించడం మానాలని.. అప్పుడే దేశం మారుతుందన్నాడు. క్రికెట్‌ కోసం చాలా సమయం, శక్తి సామర్థ్యాలు వృథా చేస్తున్నారని.. నిజాయితీగా పని చేయడానికి వాటిని ఉపయోగించాలని సూచించారు. అది నిజమైన దేశభక్తి అని మొర్తజా అన్నాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy