డబ్బులు వాపస్ ఇస్తాం.. ఈ తేదీల్లో రండి

cricket-ind-ausభారత్, ఆసీస్ ల టీ20 రద్దుతో నిరాశకు గురైన ప్రేక్షకులకు టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వడానికి రెడీ అయ్యింది HCA. దీనికి సంబంధించిన తేదీలను సోమవారం ప్రకటించింది. ఆయా తేదీల్లో ప్రేక్షకులు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి తమ టికెట్‌ను తీసుకురావడంతో పాటు తమ బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు కూడా అందజేయాలని… నేరుగా అకౌంట్‌లోకి డబ్బులు బదిలీ చేస్తామని తెలిపింది HCA.

ఉప్పల్‌లో మైదానం అనుకూలంగా లేకపోవడంతో ఈ నెల 13న జరగాల్సిన మూడో టీ20 ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. కార్పొరేట్, హాస్పిటాలిటీ బాక్స్‌లకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అపెక్స్‌ కౌన్సిల్‌ తెలిపింది.

HCA ప్రకటించిన తేదీలు:

అక్టోబర్‌ 23, 24: రూ. 800

అక్టోబర్‌ 25, 26: రూ. 1,000

అక్టోబర్‌ 27, 28: రూ. 1,500

అక్టోబర్‌ 30, 31: రూ. 5,000

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy