
డైలీ మెయిల్ కథనం ప్రకారం.. 17 ఏళ్లకే బాయ్ ఫ్రెండ్ తో తొలి సంతానాన్ని కన్నది బ్రిటన్ కు చెందిన చెరిల్. ఇప్పుడు ఆ బిడ్డ వయస్సు 15 ఏళ్లు. చెరిల్ వయస్సు 32ఏళ్లు. తొలి సంతానాన్ని కనే సమయంలో ఓ ప్రైవేట్ హాస్టలే ఆమె సొంతగూడు. కన్నవాళ్లు ఉన్నా లేనట్టుగానే ఉండేది. దీంతో ఆమెకు ఆదాయం లేదు. బాయ్ ఫ్రెండ్స్ తో పరిచయాలు.. ఆ తర్వాత రెండు పెళ్లిళ్లు.. మళ్లీ ఇంకొకరితో డేటింగ్. ఇలా ఇప్పటికే మూడు పెళ్లిళ్లు.. 12 మంది సంతానంగా సాగిపోయింది ఆమె జీవితం. మరి ఖర్చులకు ఎలా అంటారా.. ఆదాయం లేనివారికి బెనిఫిట్స్ ఇన్ కమ్ కింద వారానికి రూ.4వేల 800 ఇస్తుంటుంది బ్రిటన్ గవర్నమెంట్. పిల్లలుంటే వారికి కొంత అమౌంట్ ఇస్తుంటారు. అలా వచ్చే ఆదాయంపై తను ఆధారపడుతుంది. అయితే పిల్లల్ని బాగానే చూసుకుంటుంది చెరిల్. ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులతో పిల్లల అవసరాలను తీరుస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా.. ప్రభుత్వ పథకాలను ఈ రకంగా వాడుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనికంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉండదంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు బ్రిటన్ ప్రజలు.