‘డాల్బీ అట్మాస్ సౌండ్‘ తో బాహుబలి ట్రైలర్..!

bahubali-2తెలుగు సినీ చరిత్రలో మొట్టమెదటి సారిగా కొత్త ప్రయోగం చేయనన్నారు. బాహుబలి సినిమా ట్రైలర్ లో డాల్బీ అట్మాస్ సౌండ్ ప్రయోగాన్ని ఉపయోగించనున్నారు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. అయితే ఈ టెక్నాలజీని హిందీ బాహుబలి ట్రైలర్ కు మాత్రమే వాడనున్నారు. బాహుబలి హిందీ ట్రైలర్ ను జూన్ 1 న బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ రిలీజ్ చేయనున్నారు. చాలా థియేటర్ల లో ఈ టెక్నాలజీ లేకపోవడంతో ఈ టెక్నాలజీ ఉన్న ఓ థియేటర్ లో మాత్రమే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు కరణ్. ఇప్పటికే హిందీ బాహుబలి సినిమా హక్కులను కరణ్ జోహార్ తీసుకున్నారు. తెలుగు, తమిళ్  ట్రైలర్, ఆడియో మే 31 న హైటెక్స్ లో రిలీజ్ అవుతుంది. జులై 10 న అన్ని భాషల్లో వాల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో హై టెక్నాలజీ తో వీఎఫ్ఎక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ డాల్బీ అట్మాస్ సౌండ్ ప్రేక్షకులకు ఓ సరికొత్త సౌండ్ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వనున్నట్లు మూవీ యూనిట్ పేర్కొంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy