డిండి ప్రాజెక్టుకు విద్యాసాగర్ రావు పేరు

R.VIDYA-SAGAR-RAO-DINDIడిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటి పారుదల నిపుణుడు, దివంగత ఆర్. విద్యాసాగరరావు పేరు పెట్టాల్సిందిగా నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన  ఫైల్ పై శనివారం (ఏప్రిల్-14)  సంతకం చేశారు సీఎం కేసీఆర్. ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్‌ను ఇకపై ఆర్.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకంగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యాసాగర్‌రావు ప్రథమ వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సాగు, తాగునీటిలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించారని.. సాగునీటి రంగంలో విద్యాసాగర్‌రావు కృషి ఎనలేనిదని తెలిపారు  సిీఎం కేసీఆర్.  29 ఏప్రిల్,2017న విద్యాసాగర్‌రావు మృతిచెందిన విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy