డిగ్గీ ట్విట్ : అన్ని విజన్స్ ఒకే చోట

diggi-tweat100 అక్షరాల్లో చెప్పలేనిది ఒక్క ఫొటో చెబుతోంది.. నాలుగు పేజీల్లోని భావం నాలుగు లైన్లలో చెప్పొచ్చు.. అలాంటి ఫొటోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎక్కడో పుట్టి.. ఎక్కడికో వచ్చి.. దిగ్గీ ట్విట్ తో దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీ నేతలు, కార్యకర్తలకు చురకలు అంటించేలా ఉండటంతో పెద్దఎత్తున సెటైర్ పడుతున్నాయి ఈ ఫొటోకు.. వివరాల్లోకి వెళితే..

ఏ ఊరో.. ఏ ప్రాంతమో స్పష్టంగా తెలియకపోయినా.. అది ఓ ATM సెంటర్. ఆ సెంటర్ లో ఓ పక్కన ఆవు సేదతీరుతూ ఉంటుంది. ఆ పక్కన పేడ వేసి ఉంటుంది.. ఈ ఫొటోకు డిగ్గీ ట్విట్ ఇలా చేశాడు. మోడీ అన్నీ ఓకే చోట ఉన్నాయి. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, గోరక్ష అని కామెంట్ పెట్టారు. ATM సెంటర్ ను డిజిటల్ ఇండియాతో పోల్చితే.. పేడను స్వచ్ఛ భారత్ తో పోల్చారు.. ATM సెంటర్ లో సేదతీరుతున్న ఆవును గోరక్షతో పోల్చి ట్విట్ చేశారు. డిగ్గీ ట్విట్ కు.. బీజేపీ కౌంటర్ ఎలా ఉంటుందో.. ఏ స్థాయిలో పంచ్ ఉంటుందో అని నెటిజన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy