పేదల ఇళ్లలో డిజిటల్ వెలుగులు నింపుతున్న ‘విద్యాయంత్ర’

compu2డిజిటల్ ఇండియా.. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. సామాన్యుడి నుంచి దేశ ప్రధాని వరకు ఇదే జపం. పల్లె జనం కూడా లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేయాలన్నదే భారత్ కల. ఇది నిజం కావాలంటే సామాన్యుడికీ కంప్యూటర్ చేరాలి. ఇదే లక్ష్యంతో ఓ యువ బృందం ముందుకు సాగుతోంది. పేదలకు తక్కువ ధరకే కంప్యూటర్లు ఇస్తామంటున్న విద్యాయంత్ర సంస్థపై V6 స్పెషల్ స్టోరీ…..

కాస్త పాడైపోయిన కంప్యూటర్లను  కార్పొరేట్ సంస్థల నుంచి స్క్రాప్ కింద కొంటారు. వీటిని రిపేర్ చేసి పేదలకు తక్కువ ధరకే అందిస్తున్నారు విద్యాయంత్ర  సంస్థ సభ్యులు. మిథున్, శ్రవణ్, జగదీష్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్ళకి పేదలకు తక్కువ ధరకే కంప్యూటర్ అందించాలన్న ఆలోచన వచ్చింది. అలా వచ్చిన ఐడియా నుంచి పుట్టిందే విద్యాయంత్ర.  హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో  ఓ బిల్డింగ్ రెంట్ కు తీసుకుని కార్పొరేట్ సంస్థల నుంచి స్ర్కాప్ కింద కొనుగోలు చేసిన కంప్యూటర్లను బాగుచేసి పేదలకు అందిస్తున్నారు.

compu3సాప్ట్ వేర్ కంపెనీలకు సెంటరైన గ్రేటర్ హైదరాబాద్ లో ఈ-వేస్ట్ ఫుల్లుగా ఉంది. అలా పారేసిన కంప్యూటర్లకు చిన్న చిన్న రిపేర్లు చేసి సామాన్యులకు అందిస్తున్నారు. ఫైనాన్స్ ఫ్రాబ్లమ్స్ తో కంప్యూటర్ కొనలేని పేదలకు 3 వేలకు అందించడంతో ఎంతో యూజ్ అవుతోందంటున్నారు విద్యాయంత్ర మెంబర్స్. ఆన్ లైన్ లో అప్లై చేసుకున్న వంద మంది పేదలకు ఫ్రీగా కంప్యూటర్ ఇస్తామనడంతో భారీగా స్పందన వస్తోంది. కంప్యూటర్ కావాలంటూ ఇప్పటివరకూ రెండు వేల 3 వందల అప్లికేషన్స్ వచ్చాయి. వీటిని పరిశీలించి అర్హులకు కంప్యూటర్లు అందిస్తారు. కంప్యూటర్ కావాలనుకునే వారు ముందుగా వెబ్ సైట్ లో పూర్తి డిటేయిల్స్ ఎంట్రీ చేసుకోవాలి. గ్రామీణ ప్రాంత పేదలకు కూడా మూడు వేలకే కంప్యూటర్ అందిస్తున్నారు.

కాస్ట్లీ కంప్యూటర్ కొనుగోలు చేయలేని తమకు…  తక్కువ ధరకే కంప్యూటర్ అందిస్తున్న విద్యాయంత్ర సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్నారు నిరుద్యోగులు. మంచి ఆలోచనలతో ముందుకెళ్తున్న విద్యాయంత్ర సభ్యులను అంతా అభినందిస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy