డిజిటల్ ఇండియా స్ఫూర్తితో యూత్ ఫెస్ట్

youth-fest-2017జాతీయ యువజనోత్సవాలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు రెడీ అయింది సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్. హర్యానాలోని రాహ్ టక్ లో 21వ జాతీయ యువజనోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో యూత్ ఫర్ డిజిటల్ థీమ్ తో కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో లాడో మస్కట్ అందర్నీ ఆకర్షించనుంది. జవనరి 12 నుంచి 16 వరకు యుువజనోత్సవాలు కొనసాగుతాయన్నారు కేంద్రమంత్రి విజయ్ గోయల్. యువతనుద్దేశించి ఒపెనింగ్ సెరిమనీలో ప్రధాని మోడీ  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారన్నారాయన.

స్వామీ వివేకానంద 155వ జయంతి సందర్భంగా..ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ప్రధాని నరేంద్రమోడీ. యువత మంచి మార్గంలో నడవడానికి స్వామీజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వివేకానంద ఆలోచనలు, ఆదర్శాలు ఎప్పటికీ ఆదర్శమేన్నారు మోడీ. ఆయన సూక్తులు తరతరాలు కొనసాగుతాయన్నారు. ఆధ్యాత్మికత, సోదరభావం, నైతిక ఆదర్శాలను అందరం పాటిద్దాం అన్నారు ప్రధాని మోడీ.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy