డిజిటల్ చెల్లింపులు: జీఎస్టీలో రాయితీ

siteనగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి పన్ను రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. రూ.2000 వరకు డిజిటల్ లావాదేవీలపై 2 శాతం జీఎస్టీ డిస్కౌంట్‌ను క్యాష్‌రూపంలో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఆర్థిక , ఆర్బీఐ, క్యాబినెట్ సెక్రటేరియేట్, ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ శాఖ ఈ ప్రతిపాదనపై సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా చిన్నమొత్తాలు చెల్లించే సమయంలోనూ డిజిటల్  లావాదేవీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందని ఐ.టీ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఈ ప్రతిపాదనకు రిజర్వు బ్యాంకు ఆమోదం తెలిపితే దాన్ని అమలు చేయడానికి అనుసరించాల్సిన విధివిధానాలపై కసరత్తు చేయాల్సి ఉంటుందన్నారు ఆ అధికారి. నిజానికి పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలోనే డిజిటల్ లావాదేవీలు జరిపేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. 2016 నవంబర్ లో డిజిటల్ లావాదేవీల సంఖ్య 67కోట్లు(రూ.94 లక్షల కోట్లు) కాగా, 2017 మార్చినాటికి బాగా పెరిగాయి. మార్చి నెలలో డిజిటల్ లావాదేవీల సంఖ్య 89 కోట్లు(రూ.149 లక్షల కోట్లు). జూన్ నెలలో ఈ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. ఆ నెలలో 84 కోట్లు(రూ.114 లక్షల కోట్లు) డిజిటల్ లావాదేవీలు జరిగాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy