డిప్యూటీ కలెక్టర్ గా పి.వి.సింధు

babu-sindhuభారత షట్లర్‌,రియో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పి.వి.సింధు ఇక డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. సింధుకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు డిప్యూటీ కలెక్టర్‌ పోస్ట్ ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని సింధు తల్లి విజయ ఏఎన్ఐ వార్తా సంస్థకు  తెలిపారు.

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు సింధుకు భారీ నజరానాలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు  రూ.3కోట్లు, గ్రూప్‌-1 ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే సింధుకు డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు సిద్ధం చేస్తోంది. దీనిపై సింధు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  ప్రస్తుతం సింధు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బిపిసిఎల్‌ హైదరాబాద్ కార్యాలయంలో 2013 నుంచి అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుటికే ఆమెకు మూడు కోట్ల రూపాయల నగదు, తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నగదు ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఆమెకు హైదరాబాద్‌లో వెయ్యి గజాల స్థలం కూడా ఇచ్చింది.

4 Responses to డిప్యూటీ కలెక్టర్ గా పి.వి.సింధు

 1. Satyanarayana paruchuru says:

  News coverage is so nice

 2. Satyanarayana paruchuru says:

  It is very happy news that world no 1 and our Indian badminton player becoming deputy collector in Andhra pradesh Government .
  Hard work and disciplined player will know the problems of the public and she will do effectivily administration work.I wish her all success in life and job.

 3. Sekhar says:

  All the very best to P.V.Sindhu in her new assignment.

 4. M Satyanarayan Reddy. says:

  Let us wish her for success in the new assignment

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy