డిప్యూటీ సీఎంగా ప్రమాణం…కతువా కేసుపై వివాదాస్పద వ్యాఖ్యలు

kaviసోమవారం(ఏప్రిల్-30)  జరిగిన జమ్మూ-కాశ్మీర్ మంత్రివర్గ విస్తరణలో డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కవీందర్‌ గుప్తా. కతువా కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన చాలా చిన్నదని, దానికి అంత  ప్రాధాన్యత ఇవ్వకూడదన్నారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కవీందర్ స్పందించారు. కతువా  లాంటి కేసులు చాలా ఉన్నాయని మాత్రమే తాను అన్నానని, దీన్ని వివాదాస్పదం చేయవద్దని కవీందర్ తెలిపారు. కతువా కేసు న్యాయస్ధానం పరిధిలో ఉన్నందున దీన్ని పదేపదే ప్రస్తావించడం సరైంది కాదన్నారు. ఈ ఏడాది జనవరి 10న కథువాలో  8 ఏళ్ల చిన్నారిని అపహరించిన దుండగులు లైంగిక దాడి జరిపి దారుణంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy