డిల్లీకి చేరిన సీఎం

kcrసీఎం కేసీఆర్ సోమవారం రాత్రి 9 గంటలకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన రాత్రి 11 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరగనున్న రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు కేసీఆర్. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్, కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతితో సీఎం భేటీ అవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద ఉన్న పదకొండు ప్రాజెక్టుల్లో వరద కాల్వ, దేవాదుల, భీమా ప్రాజెక్టులకు రూ.5,490 కోట్లు మంజూరు చేయాలని ప్రధానిని కోరనున్నారు సీఎం. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్‌ భగీరథకు రూ.19 వేల కోట్లు కేటాయించాలంటూ గతంలో నీతి ఆయోగ్‌ చేసిన సిఫార్సులనూ మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. గ్రానైట్, బీడీ, చేనేత పరిశ్రమల ఉత్పత్తులపై జీఎస్‌టీని సడలించాలని, ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని కోరనున్నారు. విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రధానికి విన్నవించనున్నారు కేసీఆర్. వెనకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన మూడో విడత రూ.450 కోట్ల ఆర్థిక సాయం వెంటనే విడుదల చేయాలని, సచివాలయ నిర్మాణానికి రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న బైసన్‌ పోలో గ్రౌండ్‌ అప్పగింతను వేగవంతం చేయాలని కోరనున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడుకు శుభాకాంక్షలు తెలుపనున్నారు. అలాగే పదవీ కాలం ముగియనున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఆయనకు కొత్తగా కేటాయించిన ప్రత్యేక నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకుంటారు సీఎం. ఇప్పటికి ఖరారైన షెడ్యూలు ప్రకారం 27న ఆయన తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy