డిసెంబర్ 26 – చారిత్రక ప్రత్యేకతలు

historyచరిత్రలో ఇవాళ్టి ప్రత్యేకతలు….

1791: కంప్యూటర్… ఇప్పుడో నిత్యావసరం. దీన్ని ప్రపంచానికి అందించినవాడు చార్లెస్ బబేజ్. ఆయన పుట్టింది ఈ రోజే. లండన్ లోని వాల్ వర్త్ రోడ్ లో పుట్టాడు. చదువులో ముందుండే వాడు బబేజ్. మేథ్స్ అంటే ప్రాణం. అనలిటికల్ మేథ్స్ అంటే బబేజ్ ఎంతో ఇష్టపడేవాడు. యాంత్రికంగా లెక్కలు చేయడం ఎలా అనే ఆలోచన నుంచి పుట్టిందే కంప్యూటర్. ఫ్రెంచ్ గవర్నమెంట్ సహాయంతో కంప్యూటర్ పై పరిశోధనలు చేసి దాన్ని ఆవిష్కరించాడు. ఆయన 40 ఏళ్ల పాటు  కంప్యూటర్ పరిశోధనలపైనే గడిపాడు. 79 ఏళ్ల వయస్సులో 1871 అక్టోబర్ 19న చనిపోయాడు బబేజ్. చనిపోయిన తర్వాత ఈ మహామేధావి మెదడును లండన్ సైన్స్ మ్యూజియంలో ఉంచారు.

1893: మావో జెడాంగ్… కమ్యూనిస్ట్ విప్లవదిగ్గజం. పోరాటానికి మారుపేరుగా నిలిచిన మావో పుట్టింది ఈ రోజే. చైనాలోని హునాన్‌ రాష్ట్రం షావో షాన్‌ గ్రామంలో ఓ రైతు కుటుంబంలో పుట్టాడు. భూస్వామ్య, బూర్జువా వ్యవస్థలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు మావో. మిత్రులతో కలిసి చైనా అభివృద్ధికి పథక రచన చేసేవాడు. మార్క్స్ స్ఫూర్తితో సామ్యవాదాన్ని ఎంచుకున్నాడు. చైనాలో శ్రామిక, కార్మిక లోకాన్ని ఏకం చేసి …. పెట్టుబడిదారి వ్యవస్థ నిర్మూలనకు విప్లవాన్ని లేవదీశాడు. తన రచనల ద్వారా మార్క్సిజం, లెనినిజం తాత్విక ఆలోచనను మావో మరింత అభివృద్ధి చేశాడు. చరిత్రాత్మక లాంగ్ మార్చ్ తో చైనా మొత్తాన్ని కదిలించాడు. సాంస్కృంతిక విప్లవంతో చైనాలో సరికొత్త అధ్యాయాన్ని రాశాడు. ఈ విప్లవంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని స్థాపించాడు. ఈ నవ చైనా నిర్మాణ శిల్పి 82ఏళ్ల వయస్సులో 1976 సెప్టెంబర్ 9న కన్నుమూశాడు.

1982: టైమ్స్ మ్యాగజైన్… ప్రపంచ వ్యాప్తంగా పేరున్న వీక్లీ. అమెరికాకు చెందిన ఈ మ్యాగజైన్ ఏటా పర్సన్ ఆఫ్ ద ఇయర్ ని ఎంపిక చేసి కవర్ పేజీగా ఫొటో పబ్లిష్ చేస్తుంది. ఈ మేగజైన్ తొలిసారిగా మనిషి బొమ్మలేకుండా ఒక యంత్రం ఫొటోని ప్రచురించింది ఈ రోజే. మ్యాన్ ఆఫ్  ది ఇయర్ ప్లేస్ లో కంప్యూటర్ ను ప్రచురించింది.

2004: సునామి… తీర ప్రాంతాలను ముంచెత్తే భారీ సముద్ర భూకంపం. దేశాలకు దేశాలే దాటి మనదేశాన్ని కూడా వణికించిన భారీ సునామీ సంభవించింది ఈరోజే. ఇండోనేషియాలో మొదలైన సునామీ ఇండియా, శ్రీలంక, థాయ్ లాండ్, మలేషియా, మాల్దీవులలో ఊహించని విధ్వంసాన్ని, ప్రాణనష్టాన్ని తెచ్చిపెట్టింది. సునామీ దెబ్బకు రెండున్నర లక్షల మంది చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy