డీజిల్, పెట్రోల్ కార్లపై ఆంక్షలు : కరెంట్ బండ్లకు డిస్కౌంట్స్

Vehicles jam the road after a flyover was briefly closed to vehicular traffic for precautionary measures following an earthquake in Srinagarపర్యావరణ పరిరక్షణ – ఇంధన పొదుపులో భాగంగా కేంద్రం కొత్త ప్రకటన చేయనుంది. రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజల్ తో నడిచే కార్ల రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధించనుంది. 2030 నాటికి 60 బిలియన్ డాలర్ల ఇంధనం అంటే.. కనీసంగా రూ.4 లక్షల కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా నిర్ణయించనుంది. ఇంధన పొదుపు చేయడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకురానున్నారు. అంతేకాదు పెట్రోల్, డీజిల్ కార్లను తగ్గించి.. విద్యుత్ ఆధారిత కార్లును ప్రోత్సహించాలని నిర్ణయించబోతున్నారు. ఒక్కక్కరికీ ఒక్కో కారు కాకుండా.. షేరింగ్ విధానాన్ని మరింత ప్రోత్సహించనుంది. ఎలక్ట్రికల్ కార్లపై సబ్సిడీలు, డిస్కౌంట్స్ అందించటానికి ప్రణాళిక రెడీ చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా గ్రీన్ కార్ పాలసీని తీసుకురానుంది కేంద్రం. థింక్ ట్యాంక్ సంస్థ రూపొందించిన నివేదిక ఆధారంగా నీతి ఆయోగ్ సంస్థ కేంద్రానికి ఈ ప్రతిపాదనలు చేసింది. ఇంధన పొదుపునకు సత్వర చర్యలు అవసరమైన హెచ్చరించింది నీతి ఆయోగ్.

కేంద్రానికి నీతి ఆయోగ్ చేసిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి :

… ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధిస్తూ.. క్రమంగా వేటు వేసే దిశగా చర్యలు తీసుకోవాలి.

… పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఆధారిత వాహనాల తయారీ, వాడకాన్ని పెంచాలి. అందుకు తగిన ప్రోత్సాహకాలను ప్రకటించాలి.

కేంద్రానికి సమర్పించిన నీతి ఆయోగ్ నివేదిక పలు సూచనలు కూడా చేసింది. కరెంట్ తో నడిచే వాహనాలకు ఆర్థిక ప్రోత్సకాలు అందించటమే కాకుండా.. రాయితీలు ఇవ్వాలని స్పష్టం చేసింది. కొనుగోలుదారులకు కూడా భారీ డిస్కౌంట్లు ఇవ్వటం ద్వారా అమ్మకాలను పెంచాలన్నది. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ కార్ల రిజిస్ట్రేషన్లను పరిమితం చేయటం.. ఆంక్షలు విధించటం చేయాలని చెబుతోంది. ప్రస్తుతం వాహన అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు వినియోగించాలని స్పష్టం చేసింది. బ్యాటరీల తయారీకి కన్సార్టియమ్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy