డుకాటీ బైకుకు..ఎంతో తెలుసా.. 20 లక్షలు

ducati-bikesద్విచక్ర వాహనాల సంస్థ డుకాటీ డయావెల్‌ డీజిల్‌ మోటార్‌ సైకిల్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.19.92 లక్షలు (ఎక్స్‌షోరూం డిల్లీ)గా నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వాహనాలు 666 మాత్రమే ఉత్పత్తి చేస్తామని, ఈ బైకు కోసం ప్రత్యేకంగా ఆర్డరు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది ఆ సంస్థ. ప్రత్యేక వాహనాలను తీసుకొచ్చేందుకు డుకాటి, డీజిల్‌ సంస్థలు 2012లో చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం డుకాటికి అవసరమైన జాగ్‌ జీన్స్‌లు, లెదర్‌ జాకెట్లు, టి-షర్టులు వంటి వాటిని డీజిల్‌ అందిస్తుంది. ఈ కొత్త బైకుకు సంబంధించిన జాకెట్లు, టి-షర్టులు వంటి వాటిని త్వరలోనే డుకాటి విక్రయ కేంద్రాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ బైకులు ఆగస్టులో డెలివరీ కానున్నాయి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy