డేట్ ఫిక్స్: హైదరాబాద్‌కు  ఇవాంకా ట్రంప్‌ 

ivankaఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె… సలహాదారు ఇవాంక ట్రంప్ త్వరలోనే హైదరాబాద్ రానున్నారు. నవంబర్ 28న జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు (GES)లో పాల్గొనాల్సిందిగా ఇవాంకాను ప్రధాని మోడీ ఆహ్వానించారు. ఈ సదస్సుకు మోడీ కూడా హజరుకానున్నారు. 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సదస్సును ప్రారంభించగా.. ఈసారి ఎనిమిదో సదస్సు జరగనుంది. గత జూన్లో అమెరికా వెళ్లిన మోడీ భారత్‌లో ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఇవాంక ట్రంప్‌ను కోరారు. దీనికి ఇవాంకా ట్రంప్‌ ఆమోదం తెలిపారు.

ఈ సదస్సు నిర్వహణ కోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు కూడా పోటీ పడ్డాయి. కానీ హైదరాబాద్‌కున్న అనుకూలతల కారణంగా  సదస్సు నిర్వహించే అవకాశం చివరికి  హైదరాబాద్ కే దక్కింది. కేంద్రం సూచనల ప్రకారం మేరకు గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్‌ నిర్వహణ కోసం నీతి ఆయోగ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. భారత్ తొలిసారిగా ఈ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో హెచ్1బీ వీసాల అంశాన్ని భారత్ అమెరికా దృష్టికి తీసుకురానుంది.

సదస్సులో వర్క్ షాప్‌లను విస్తృత స్థాయిలో నిర్వహించనున్నారు. 2010లో జరిగిన తొలి సదస్సుకు వాషింగ్టన్ ఆతిథ్యం ఇవ్వగా.. తర్వాతి ఏళ్లలో ఇస్తాంబుల్, దుబాయ్, కౌలాలంపూర్, మర్రాకేష్, నైరోబీ, సిలికాన్ వ్యాలీల్లో వరుసగా ఈ సదస్సును నిర్వహించారు. స్టారప్ట్‌ ఇండియాలో భాగస్వామ్యం ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ ఏడాది ముఖ్యంగా మహిళా వ్యాపారవేత్తల పురోగతిపై దృష్టి సారించనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy