డైరెక్టర్స్ డే: ఛాంబర్ లో దాసరి విగ్రహావిష్కరణ

dasari-statueహైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో దాసరి నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు సినీ ప్రముఖులు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై… దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇండస్ట్రీకి దాసరి నారాయణ రావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా  సీనియర్ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. 151 సినిమాలకు దర్శకత్వం వహించడం మాటలు కాదన్నారు. గిన్నీస్ రికార్డ్స్‌లో దాసరి నారాయణరావు పేరు నమోదైందని… భవిష్యత్తులో ఏ దర్శకుడూ 151 సినిమాలు చేయలేడన్నారు కృష్ణ.

దాసరి నారాయణ రావు ముక్కుసూటి మనిషి అని నటుడు బాలకృష్ణ తెలిపారు. ఎంతో మంది దర్శకులు దాసరి స్ఫూర్తిగా నిలిచారన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండి ఆదుకునే వారన్నారు. ఇండస్ట్రీ బాగు కోసమే ఆయన జీవితాంతం కృషి చేశారన్నారు బాలకృష్ణ.

దాసరిని హ్యూమన్ కంప్యూటర్ గా అభివర్ణించారు నటుడు మురళీమోహన్. తాను కార్మిక పక్షపాతినని చెప్పేవారని.. అలాగే దాసరి జీవించారన్నారు. దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నటులు కృష్ణ, విజయనిర్మల, బాలకృష్ణ నిర్మాతలు అల్లు అరవింద్, దాసరి తనయుడు అరుణ్, దర్శకులు కోడి రామకృష్ణ, అంబికాకృష్ణ, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy