డైరెక్టర్ క్రిష్ కు మరో అరుదైన అవకాశం

kangana-manikarnikaగౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో చారిత్రక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు క్రిష్. తాజాగా ఆయన మరో అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఈ సారి పిలుపు ఏకంగా బాలీవుడ్ నుంచి వచ్చింది. ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత కథను సినిమాగా తీయడానికి రెడీ అవుతున్నాడు క్రిష్. ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా నటించేందుకు కంగనా రనౌత్ రెడీ అని బాలీవుడ్ టాక్. ‘మణికర్ణిక – ద క్వీన్ ఆఫ్‌ ఝాన్సీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్ లో వైరల్ అవుతోంది. మణికర్ణికగా కంగనాను తీర్చిదిద్దిన ఫొటో అది. ‘బాహుబలి’, ‘బజ్‌రంగీ భాయీజాన్’ చిత్రాల కథకుడు వి. విజయేంద్రప్రసాద్‌ (రాజమౌళి తండ్రి) ఈ చిత్రానికి స్ర్కిప్టును సమకూరుస్తున్నారు. వాస్తవానికి మొదట దర్శకునిగా కేతన్ మెహతాను నిర్మాతలు ఎంచుకున్నారు. తర్వాత ఆయన స్థానంలో క్రిష్‌ వచ్చారు. చారిత్రక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని క్రిష్‌ రూపొందించిన విధానమే ఆయనకు ఈ సినిమా అవకాశాన్ని తెచ్చిందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇది ఆయనకు రెండో హిందీ చిత్రం. ఇదివరకు అక్షయ్‌కుమార్‌తో ఆయన ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ చిత్రాన్ని తీశారు. కాగా ‘మణికర్ణిక’ సినిమా జూన్ మొదటి వారంలో సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ సినిమా తర్వాత హిందీలోనే అక్షయ్‌కుమార్‌తో మరో సినిమా చేయనున్నారు క్రిష్‌.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy