డ్రంక్ అండ్ డ్రైవ్ లో..ఒకరి మృతి

Car-Hits-Divider-In-Jubilee-Hillsహైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా… నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అతి వేగంతో డివైడర్, చెట్టును వోక్స్ వ్యాగన్ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని కాచిగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

శుక్రవారం అర్థరాత్రి(జనవరి-12)మణికొండలో గెట్ టూ గెదర్ పార్టీకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. పార్టీలో మద్యం సేవించిన వీరు అతివేగంగా కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని బాసర సరస్వతి గుడిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసి ఇటీవలే సస్పెండ్ అయిన విశ్వజీత్ గా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటలో కారు పూర్తిగా ధ్వంసమైంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy