డ్రగ్స్‌కు వ్యతిరేకంగా 5కే వాక్‌

arunయూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌, ఎంసీసీ బార్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఆదివారం(ఆగస్టు-5) ఉదయం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో 5కే సైక్లింగ్‌, 5కే వాక్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరై జడ్జిలు రాధారాణి, రేణుకలతో కలిసి ప్రారంభించారు. మాదకద్రవ్యాలు ఎంతో ప్రమాదకరమైనవని వాటిని నివారించాల్సిన అవసరముందన్నారు జడ్జిలు. డ్రగ్స్ కు చిన్నారులు బలి కాకుండా పేరెంట్స్‌, పాఠశాల ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు హరిమోహన్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్ది, జల్లి కనకయ్య, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy