డ్రగ్స్ కేసు : కెల్విన్ ఫోన్ లో సీక్రెట్ ఫోల్డర్

kelwinడ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి కెల్విన్ ను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. విచారణలో కెల్విన్ మరో ఎనిమిదిమంది పేర్లు తెలిపినట్లు సమాచారం. నిందితులుగా పేర్కొన్న ఈ లిస్టులో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ మాఫియాలో ప్రధాన నిందితుడు కెల్విన్‌ ను విచారణ కోసం తమకు అప్పగించాలని ఎక్సైజ్‌ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కోర్టులో పిటిషన్‌ వేసింది. ఈమేరకు రెండు రోజుల కస్టడీకి అనుమతించడంతో ఎక్సైజ్‌ అధికారులు చర్లపల్లి సెంట్రల్‌ జైలులో ఉన్న అతడిని తమ కస్టడీకి తీసుకున్నారు.

జైలు నుంచి నిందితుల‌ను క‌స్ట‌డీలోకి తీసుకున్న పోలీసులు తర్వాత వారిని హైద‌రాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాల‌యానికి త‌ర‌లించారు. అక్క‌డ కాసేపు విచార‌ణ జ‌రిపిన అధికారులు ప్ర‌స్తుతం వారిని ర‌హ‌స్య ప్రాంతానికి త‌ర‌లించారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు కెల్విన్ స‌హా ఖుద్దుస్‌, వాహిద్‌లను పోలీసులు ర‌హ‌స్య ప్రాంతంలో విచారించ‌నున్నారు.

బాలానగర్ ఎక్సైజ్ కార్యాలయంలో సిట్‌ బృందం కెల్విన్ను విచారించింది. కెల్విన్ తోపాటు, ఖుద్దుస్‌, వాహిద్‌లను కూడా సిట్‌ అధికారులు విచారించారు. మరోవైపు కెల్విన్‌ ఫోన్‌లో సీక్రెట్‌ ఫోల్డర్ ను అధికారులు డీకోడ్‌ చేశారు. విచారణలో మరో ఎనిమిది మంది పేర్లను కెల్విన్ తెలినట్లు తెలుస్తోంది. దీంతో తమ దగ్గర ఉన్న ఆధారాలతో అధికారులు రెండో జాబితాను సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం మరో ముగ్గురు నిందితులు అమన్‌ నాయుడు, నిఖిల్‌శెట్టి, కుందన్‌ సింగ్ ను సిట్‌ అధికారులు సోమవారం (జులై17) కస్టడీలోకి తీసుకోనున్నారు.

కెల్విన్‌, ఖుద్దుస్‌, వాహిద్‌లను కూడా సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. కెల్విన్‌ కాల్‌లిస్ట్‌ ఆధారంగా ఇప్పటికే 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఈ నెల 19 నుంచి సిట్‌ విచారణకు హాజరుకానున్నారు.

ఇప్పటివరకూ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయినవారి సంఖ్య 14కి చేరింది. ఇక కెల్విన్‌కు సినీ నటులు, డైరెక్టర్‌కు డ్రగ్స్‌తో సంబంధాలున్నాయని వెలుగులోకి రావడంతో పాటు, కొన్ని ప్రముఖ విద్యాలయాల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడనే ఆరోపణలున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy