డ్రగ్స్ కేసు : నోటీసులు అందుకున్న హీరో, హీరోయిన్స్ వీరేనా?

drugs-htolywodసినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. వారం రోజులుగా జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న 10 మందికి నోటీసులు అందిస్తే.. లేటెస్ట్ గా మరో ఎనిమిది మందికి నోటీసులు అందించించారు ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. ఈ ఎనిమిది మందిలో యువ హీరోలు నవదీప్, తరుణ్, హీరోయిన్స్ చార్మి, ముమైత్ ఖాన్, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామేన్ శ్యాం కె.నాయుడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్నా, సుబ్బరావు ఉన్నట్లు సమాచారం. వారం రోజుల్లో వీరు విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వీరికి నోటీసులు అందించిన విషయాన్ని అధికారికంగా ధృవీకరించటం లేదు అధికారులు. నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖులు ఉన్నారని చెబుతున్న అధికారులు.. పేర్లను బహిరంగంగా వెల్లడించటం లేదు. డ్రగ్స్ కేసులో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. నలుగురు అధికారులను కూడా నియమించింది. డ్రగ్స్ సరఫరా చేసే వారు.. వాటిని తీసుకునే వారి వివరాలను సేకరిస్తున్నారు.

నాకు నోటీసులు వచ్చాయి : నవదీప్

డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు అందాయని.. పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపాడు హీరో నవదీప్. ఏ తప్పూ చేయలేదన్నాడు. కెల్విన్ ఎవరో తెలియదని.. అతనితో పరిచయం కూడా లేదన్నాడు. అకారణంగా నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. దీని వల్ల ఎంతో డ్యామేజ్ అవుతుందన్నాడు.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy