డ్రగ్స్ కేసు: శాంపిల్స్ కు నిరాకరించిన ముమైత్

MUAITడ్రగ్స్‌ కేసులో గురువారం (జులై 27) సినీనటి ముమైత్‌ ఖాన్‌ సిట్‌ విచారించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం నాలుగున్నర గంటల వరకు కొనసాగింది. ముమైత్ ను నలుగురు మహిళా అధికారులు డ్రగ్స్ కేసుకు సంబంధించి అనేక విషయాలపై ఆరున్నర గంటలపాటు ప్రశ్నించారు.

విచారణలో ప్రధానంగా డ్రగ్స్‌ ముఠా నాయకుడు కెల్విన్‌తో ఆమెకు ఉన్న పరిచయాలపైనే ఆరా తీసినట్టు తెలుస్తోంది. అతడి సెల్‌ఫోన్‌లో ముమైత్‌ఖాన్‌ ఫోన్‌ నంబర్‌ ఉండటంతో పాటు వీరిద్దరి మధ్య వాట్సాప్‌ చాటింగ్‌ వివరాలకు సంబంధించిన అంశాలను అధికారులు సేకరించినట్టు సమాచారం. గతంలో విచారించిన వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ప్రశ్నల జాబితా ఆధారంగా ఆమెను విచారించారు. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవకముందు ఏం పనులు చేసేవారు.. హైదరాబాద్ నుంచి ముంబైకి ఎందుకు వెళ్లారన్న విషయాలను విచారణలో భాగంగా ముమైత్ ను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా గోవా, బ్యాంకాక్ లకు ఎందుకు వెళ్తారన్న సిట్ ప్రశ్నలపై ముమైత్ క్లారిటీ ఇచ్చారు. పబ్ లకు వెళ్లే అలవాట్లతో పాటు తీరిక వేళల్లో ఏం పనులు చేస్తుంటారన్న విషయాలను విచారణలో ఆమె చెప్పినట్లు సమచారం.

ప్రస్తుతం ఓ తెలుగు ఛానల్‌ నిర్వహిస్తోన్న బిగ్ బాస్ రియాల్టీలో పాల్గొంటున్న ముమైత్ ఖాన్ షో ప్రతినిధుల వెంట బుధవారం (జులై 26) రాత్రి పుణే నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి శంషాబాద్‌లోని నోవాటెల్‌ బస చేశారు. గురువారం (జులై27) ఉదయం హోటల్‌ నుంచి నేరుగా నాంపల్లిలోని సిట్ కార్యాలయానికి వచ్చి సిట్ విచారణకు హాజరయ్యారు.

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ముమైత్ ఖాన్ నుంచి అధికారులు ఎలాంటి శాంపిల్స్‌ సేకరించలేదని సమాచారం. వెంట్రుకలు, గోళ్లు, రక్తం నమూనాలను ఆమె ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. మాదకద్రవ్యాలు వాడారా లేదా అనేది శాస్త్రీయంగా నిర్థారించేందుకు ఇప్పటికే ఇద్దరి నుంచి అధికారులు శాంపిల్స్‌ను తీసుకున్నారు. గురువారం ముమైత్‌తో పాటు డ్రగ్స్‌ కేసులో మరో ఇద్దరిని కూడా సిట్‌ విచారించింది.

శుక్రవారం (జులై 28) సినీనటుడు రవితేజ విచారణకు హాజరవుతున్నట్టు సిట్ తెలిపింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy