డ్రగ్స్ కేసు : 4గంటల్లోనే ముగిసిన తనీష్ విచారణ

actor-tanishడ్రగ్స్‌ కేసులో సినీ హీరో తనీష్‌ విచారణ ముగిసింది. ఈ వ్యవహారంపై విచారణకు రావాల్సిందిగా సిట్‌ నోటీసులు జారీచేయడంతో ఆయన సోమవారం (జూలై-31) నాంపల్లిలోని ఆబ్కారీశాఖ కార్యాలయానికి హాజరయ్యారు. ఉదయం  10.30గంటలకు ప్రారంభమైన సిట్‌ విచారణ.. నాలుగు గంటలు కొనసాగింది. విచారణ నుంచి బయటకు వచ్చిన తనీష్ మీడియాతో మాట్లాడారు.

మాదకద్రవ్యాల కేసులో సిట్‌ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పినట్టు స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై కుటుంబ సభ్యులు బాధపడ్డారన్న తనీష్.. విచారణ విషయంలో మీడియా సంయమనం పాటించాలన్నారు. ఊహాగానాలు కాకుండా జరిగిన విషయాన్ని డీసెంట్‌గా ప్రజలకు చేరవేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు తనీష్. డ్రగ్స్‌ వ్యవహారంలో ఇప్పటివరకు దర్శకుడు పూరి జగన్నాథ్‌, కెమెరామెన్‌ శ్యామ్‌ కే నాయుడు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, నటుడు సుబ్బరాజు, హీరోయిన్‌ చార్మి, ముమైత్‌ ఖాన్‌, హీరో రవితేజ, నవదీప్‌ తరుణ్‌లను సిట్ అధికారులు ప్రశ్నించారు. మంగళవారం ( ఆగస్టు 1) యువ నటుడు నందు విచారణకు హాజరు కానున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy