డ్రగ్స్ తీసుకున్నానని నిజం చెప్పేసిన స్టార్ హీరో..!

ranbir-drugs2డ్రగ్స్ వ్యవహారంపై టాలీవుడ్ లో దుమారం  రేపుతుండగా..ఇప్పుడు ఓ హీరో డ్రగ్స్ తీసుకున్నాను అని  చెప్పడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అయ్యింది. అయితే ఆ హీరో టాలీవుడ్ హీరో కాదులెండీ..బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్. 2011లో వచ్చిన ‘రాక్‌స్టార్‌’ చిత్రంలో రణ్‌బీర్‌ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో రణ్‌బీర్‌ తాగిన వాడిగా స్టేజ్‌పై ప్రదర్శన ఇవ్వాల్సిన సీన్ ఒకటి ఉంది. ఈ సన్నివేశం రియాలిటీగా ఉండాలని భావించి, తక్కువ మోతాదులో డ్రగ్స్‌ తీసుకున్నాడట రణ్ బీర్. ఈ విషయాన్ని రణ్‌బీర్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతేకాదు స్కూల్లో చదువుకునే రోజుల్లోనే తనకు డ్రగ్స్‌అలవాటు ఉండేదని ఆ తర్వాత పూర్తిగా మానేశానని తెలిపాడు. ప్రస్తుతం రణ్‌బీర్‌ సంజయ్‌ దత్‌ బయోపిక్‌లో, డ్రాగన్‌ చిత్రాల్లో నటిస్తున్నాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy