డ్రగ్స్ యోగా.. దోచేందుకు దగ్గరి దారి

drugs-yogaమాయగాళ్లు యోగా రూట్ లో వెళుతున్నారు. యోగా పేరుతో డ్రగ్స్ కు అలవాటు చేస్తున్నారు కొంత మంది. యోగా నేర్పుతున్నామంటూ డ్రగ్స్ కు బానిసలు చేసి.. లక్షల్లో దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో బయటపడ్డ ఓ కేసులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని హిసాద్‌ నగర్‌కు చెందిన జగదీశ్‌ కేండీ, ఆయన భార్య కిరణ్మయి నగరంలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. హిసాద్‌నగర్‌కే చెందిన ఉషశ్రీ అనే మహిళ నడిపిస్తున్న యోగా శిక్షణ కేంద్రంలో జాయిన్ అయ్యారు. ఆ యోగా ఈ యోగా అంటూ.. వారితో మంచి రిలేషన్ ఫిప్ మెయింటేయిన్ చేశారు. వారిని గుడ్డిగా నమ్మేసింది ఆ ఫ్యామిలీ. ఇదే అదనుగా వారికి మత్తు మందులు అలవాటు చేశారు. 20 సవర్ల బంగారం.. రూ.2 లక్షలు దోచేశారు. వారి దగ్గరి నుంచి మరో 10 లక్షలు కాజేయడానికి టూర్ ప్లాన్ చేసి.. భక్తి టూర్ ఏర్పాటు చేశారు. కిరణ్మయి, జగదీశ్‌లకు అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి వారిని ఈనెల 3న తమిళనాడుకు తీసుకెళ్లారు. 4న శ్రీరంగం ఆలయం దగ్గర అద్దె భవనంలో మూడు రోజులు ఉంచారు. అనంతరం గత శుక్రవారం ఉదయం తిరువణ్ణామలైలోని మాడవీధుల్లోగల ఓ లాడ్జిలో ఉంచారు.

ఇదే సమయంలో కుంటుంబ సభ్యులు జగదీశ్ దంపతులకు ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ సమయంలో వారిద్దరూ తడబడుతూ మాట్లాడటంతో అనుమానం వచ్చి హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బంధువులు. విచారణలో ఉషశ్రీ వీరిద్దరినీ కిడ్నాప్‌ చేసి తమిళనాడుకు తీసుకెళ్లినట్లు తెలిసింది. సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ద్వారా పరిశీలించగా తిరువణ్ణామలైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విషయాన్ని తిరువణ్ణామలై ఎస్పీ పొన్నికి హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. దీంతో వారు లాడ్జిలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.

బాగా డబ్బున్న వాళ్లను గుర్తించి వారిని యోగా పేరుతో మోసం చేస్తున్నట్టు తెలుస్తోంది. వారికి మత్తుమందులు అలవాటు చేసి.. నగ్నంగా ఫొటోలు తీయడం.. వాటితో బ్లాక్ మెయిల్ చేయడం తరుచూ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. యోగా ట్రెయినర్లు ఇద్దరి నుంచి మత్తుకు ఉపయోగించే వస్తువులు, క్రెడిట్, డెబిట్, ఆధార్, రేషన్‌ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy