డ్రాగన్ దెబ్బకు విలవిల్లాడుతున్న ప్రపంచ మార్కెట్లు

china-dragon-marketsచైనా మార్కెట్లు ప్రపంచ మార్కెట్లకు చుక్కలు చూపిస్తున్నాయి. బ్లాక్ మండే నుంచి కోలుకోకముందే గురువారం కూడా దిమ్మతిరిగిపోయే షాకిచ్చాయి మార్కెట్లు. ఈ వారంలో చైనాలో సెల్ ఆఫ్ కారణంగా మార్కెట్లను నిలిపేయడం ఇది రెండోసారి. మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో మార్కెట్లను 30 నిమిషాలకే నిలిపేశారు. గత 25 ఏళ్లలో అతి తక్కువ సమయం చైనా మార్కెట్లు ట్రేడ్ అయ్యింది ఈ రోజే. చైనా దెబ్బకు మన మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 332.74 పాయింట్లు నష్టపోయి 25073.59 దగ్గర, నిఫ్టీ 106.15 పాయింట్లు నష్టపోయి 7634.85 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy