డ్రాగా రెండో టెస్ట్..పడి లేచిన విండీస్

india,westఫస్ట్ టెస్ట్ ఓటమితో డిఫెన్స్ లో పడిన వెస్ట్ ఇండీస్ జట్టు… రెండో టెస్టులో టీమ్ ఇండియా జోరుకు బ్రేక్ వేయగలిగింది. మొదటి ఇన్నింగ్స్ లో 304 పరుగుల భారీ లోటుతో బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు… సెకండ్ ఇన్నింగ్స్ లో కుదురుగా ఆడింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 48 పరుగులతో చివరిరోజు రోజు ఆట మొదలు పెట్టిన కరీబియన్లు.. అనూహ్యంగా పోరాడారు. భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తిగా డామినేట్ చేశారు.

ఆల్ రౌండ్ టాలెంట్ తో విండీస్ ను ఆదుకున్నాడు… ఛేస్. బౌలింగ్ లో రాణించి ఐదుగురు భారత బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసిన ఛేజ్… బ్యాటింగ్ లోనూ తన జట్టును ముందుండి నడిపించాడు. ఓటమి ఖాయమనుకున్న దశలో.. సెంచరీతో సత్తా చాటి మ్యాచ్ ను డ్రా గా ముగించాడు. ఐదో రోజు చివరి వరకూ బ్యాటింగ్ చేసిన ఛేస్.. 137 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. బ్లాక్ వుడ్ 63… డోరిచ్ 74… హోల్డర్ 64 పరుగులతో ఛేస్ కు సపోర్ట్ ఇచ్చారు.

చివరిరోజు ఆటముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు 388 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ, మిశ్రా చెరో 2 వికెట్లు… ఇషాంత్ శర్మ, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.  విండీస్ ను ఓటమి నుంచి కాపాడిన ఛేజ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో టెస్టు ముగిసే సరికి.. భారత జట్టు 1-0 లీడ్ తో ఆధిక్యంలో ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy