డ్రోన్ ల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువా..?

drone1డ్రోన్.. ఈ  పేరు వినగానే  ఎవరికైనా  ఠక్కున గుర్తుకు వచ్చేది  మిలటరీ  ఆపరేషన్స్.  సైనిక అవసరాలకు  డ్రోన్ సేవలను  ఎడాపెడా  ఉపయోగించుకున్నాయి  విదేశాలు.  ముఖ్యంగా   నిఘా  అవసరాలకు  డ్రోన్   సేవలను  వాడుకుంటున్నాయి . డ్రోన్.. రోబోటిక్స్  రంగంలో  మోస్ట్  అడ్వాన్స్ డ్   ఎక్విప్ మెంట్. గ్రౌండ్ నుంచి  కమాండ్స్ ఇస్తూ  ఆపరేట్  చేస్తే చాలు.. మనిషి అవసరం లేకుండానే,  అసైన్  చేసిన పనిని అలవోకగా  చేసేస్తుంది. అయితే డ్రోన్ ల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.  న్యూయార్క్ లోని  ట్విన్  టవర్స్ పై  బాంబులు  పేలిన తరువాత,  డ్రోన్ లపై ద్రుష్టి  పెట్టింది  అమెరికా.  డ్రోన్ ల సాయంతో టెర్రరిస్టుల  కోసం  ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు  ప్రాంతాలను  జల్లెడ పట్టింది.   డ్రోన్ విమానాల దాడులను  తీవ్రతరం  చేసింది.  డ్రోన్ ల సాయంతోనే , చాలా మంది  టెర్రరిస్టుల భరతం  పట్టింది.

mosquito-droneప్రపంచవ్యాప్తంగా   సైనిక  అవసరాలు  మారుతున్నాయి. మారుతున్న  అవసరాలకు  తగ్గట్లు  వ్యూహాలు మార్చుకుంటున్నాయి  అన్ని దేశాలు.  ఈ పరిస్థితుల్లో,   ద్రోన్ లను  భారీ ఎత్తున  ఏర్పాటు చేసుకోవడానికి  ఉబలాటపడుతున్నాయి  అన్ని దేశాలు .  పెద్ద సంఖ్యలో  డ్రోన్ లు  ఉండటాన్ని…. భద్రత పరంగా  ఒక ప్లస్ పాయింట్ గా భావిస్తున్నాయి.  డ్రోన్  లు  ఉంటే చాలు.. నిఘా పరంగా  మంచి  పొజిషన్ లో ఉన్నట్లే   అని  లెక్కలు వేసుకుంటున్నాయి  అన్ని దేశాలు.   ఈ విషయంలో  అమెరికా,  బ్రిటన్  ముందంజలో ఉన్నాయి.      లేటెస్ట్ గా  ఎంక్యు  9 రీపర్,  ఎంక్యు 1బి  ప్రిడేటర్  డ్రోన్   డిజైన్లను  డెవలప్  చేసింది  అమెరికా.  ఎంతో మంది టెర్రరిస్టులను   వెతికి పట్టుకోవడానికి,  ఈ  డ్రోన్ లే   ఎక్కువగా   ఉపయోగపడ్డాయి   అమెరికా కు.  నిఘా  విభాగాన్ని అండగా నిలిచాయి. సైనిక అవసరాల  సంగతి  ఎలాగున్నా,  డ్రోన్ లపై ఎడా పెడా  విమర్శలు వస్తున్నాయి. ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి అయినా.. డ్రోన్ ల సాయంతో  బాంబులు వేసి,  వేల మందిని    చంపొచ్చు.  దీంతో, మానవ హక్కుల  సంఘాలు  రంగంలోకి  దిగాయి.  భారీ ఎత్తున  జన నష్టానికి  కారణమయ్యే  డ్రోన్  లను  నిషేధించాలన్న డిమాండ్ తెర పైకి  వచ్చింది.

drones2మిలటరీ అవసరాలకు తోడు….సివిల్  పనులకు  కూడా  డ్రోన్  సేవలను  ఎడాపెడా  పయోగించుకుంటున్నాయి  విదేశాలు. కొన్ని దేశాల్లో  ట్రాఫిక్ వ్యవస్థను  కంట్రోల్  చేయడానికి  డ్రోన్  సర్వీసెస్ ను  వాడుకుంటున్నాయి. లేటెస్ట్ గా  వ్యవసాయానికి  కూడా  డ్రోన్  సేవలు  ఉపయోగించుకుంటున్నారు.  పురుగు మందులు  కొట్టడంతో  పాటు  అన్ని రకాల  పొలం  పనులకు  ద్రోన్ లను  వాడుకుంటున్నారు. అలాగే ఇది  పిజ్జాలు డెలివరీ  చేస్తున్న  డ్రోన్ లను కూడా తయారు చేశారు సైంటిస్టులు.  ఇలా రకరకాల డ్రోన్స్ తయారు చేసి అన్ని రంగాల్లో మనుషులకు పనితగ్గించే పనికి సైంటిస్టులు నడుంబిగించారు. వీటిపై వస్తున్న విమర్శల సంగతి  ఎలాగున్నా.. రానున్నది  డ్రోన్ ల  రాజ్యమేనంటున్నారు  సైంటిస్టులు.

drones3

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy