ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇస్తే..బీజేపీకే ప్రచారం చేస్తాం: కేజ్రీవాల్

kejriwalaaఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికలకు ముందే ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇస్తే ఢిల్లీలోని ప్రజలందరి ఓట్లన్ని బీజేపీకే పడుతాయన్నారు. అంతేకాదు.. బీజేపీ చేసిన ప్రయోజనంపై తమ పార్టీ కూడా ప్రచారం చేస్తుందన్నారు. ఒకవేళ ఢిల్లీని రాష్ట్రంగా గుర్తించకపోతే.. ఢిల్లీ ప్రజలు .. ఢిల్లీ వదలి వెళ్లాలన్న బోర్డులు స్థానికులు ఏర్పాటు చేస్తారు అని కేజ్రీవాల్ స్పష్టంచేశారు.

ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఉద్యమాన్ని స్వాతంత్య్ర ఉద్యమంతో పోల్చారు కేజ్రీవాల్. గాంధీ అప్పుడు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తే.. ఇప్పుడు తాము ఎల్‌జీ ఢిల్లీ ఛోడో ఉద్యమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.

తమ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అడ్డుకుంటున్నారని, మనకు ప్రజల పాలన కావాలో, ఎల్‌జీ పాలన కావాలో తేల్చుకోవాలని ప్రజలను అడుగుతానని కేజ్రీవాల్ అన్నారు. దశల వారీగా ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఉద్యమాన్ని ఆప్ చేపట్టనుందని తెలిపారు కేజ్రీవాల్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy