ఢిల్లీకి CEC: ఓటరుకు నష్టం జరగకుండా చూస్తాం

రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో బిజీబిజీగా గడిపింది కేంద్ర ఎన్నికల కమిషన్(CEC) ప్రతినిధుల టీమ్. ఇవాళ(బుధవారం) జలమండలిలో 31 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు విడతలుగా చర్చించారు సీఈసీ అధికారులు. సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉమేష్ సిన్హా నేతృత్వంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలతో మాట్లాడారు. ఓ ఒక్క ఓటరుకు నష్టం జరగకుండా చూస్తామన్నారు CEC ఉన్నతాధికారులు. ఓటర్ల నమోదుకు గడువు పెంచాలని పార్టీలు కోరాయని చెప్పారు. తొలగించిన ఓటర్లపై కూడా విచారణ జరిపించాలని పార్టీలు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అన్ని అంశాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ కు నివేదిక ఇస్తామన్నారు.

ప్రతీ జిల్లాలో పోలింగ్ బూతులు, ఓటర్ల సమాచారం, సమస్యాత్మకమైన ప్రాంతాలు,  కావాల్సిన ఎన్నికల సిబ్బందిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివి పాట్స్ లు, ఈవీఎంలపై ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించింది కేంద్ర ఎన్నికల టీమ్. ఈవీఎంల భద్రత, స్టోరేజి, రవాణా కావాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఓటర్ల జాబితా సవరణ కోసం రూపొందించిన కొత్త ఈఆర్ఒ నెట్ పై జిల్లా కలెక్టర్లకు అవగాహన కల్పించారు. గతంలో ఉన్న ఎలక్ట్రల్ రోల్ మేనేజ్ మెంట్ సిస్టంకు బదులు… ఈఆర్ వో నెట్ అనే కొత్త విదానం అమల్లోకి తెచ్చింది సీఈసీ.

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ, ఇతర శాఖల అధికారులతో భేటీ తర్వాత సెక్రటేరియట్ కు వచ్చింది సీఈసీ అధికారుల టీమ్. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, సీఎస్, డీజీపీ, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖ అధికారులతో సీఈసీ అధికారులు భేటీ అయ్యారు. ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మాట్లాడారు.  రెండు రోజుల పర్యటన ముగించుకొని…. ఢిల్లీ వెళ్లింది కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతినిధుల టీమ్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy